ఎన్నిక ఏదైనా.. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ప్రత్యేకతే వేరు. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టుగా.. ఎన్నికల అసలు ఫలితాల కన్నా.. కొన్ని రోజులు లేదా .. గంటల ముందు.. జాతీయ, ప్రాంతీయ స్థాయిలో మీడియా సంస్థలు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ ఫలితానికి ఉండే ఇంట్రస్ట్ అంతా ఇంతా కాదు. అయితే.. కొన్ని కొన్ని సార్లు.. ఈ అంచనాలు వేయడంలోను, ప్రజాభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టు వెలువరించడంలోను.. ఒక్కొక్క సారి మీడియా తడబడిన పరిస్థితి ఉంది.
కానీ జాతీయ స్థాయిలో పలు భాషల్లో ఉన్న ఇండియా హెరాల్డ్ పోర్టల్ మాత్రం.. ఇతర సంస్థలకు భిన్నంగా.. తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని ఖచ్చి తంగా ఇస్తుండడం గమనార్హం. 2014 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు హెరాల్డ్ అంచనాలు ఏ నాడూ తప్పలేదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ హెరాల్డ్ చెప్పిన, ముందుగా అంచనా వేసిన పార్టీలే అధికారంలోకి రావడం గమనార్హం. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలోను.. పార్టీల తీరుతెన్నులను వివరించడంలో జాతీయ మీడియాకు సాటిరాగల సంస్థ ఇండియా హెరాల్డ్.
2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు వస్తుందని, ఏపీలో చంద్రబాబు అధికారం చేపడతారని.. ముందు నుంచి కుండబద్దలు కొట్టింది హెరాల్డ్. కానీ, ఇతర సంస్థలు మాత్రం ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడం గమనార్హం. అదేవిధంగా 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయందక్కించుకుంటారని.. హెరాల్డ్ ముందుగానే చెప్పింది. ఇదే అక్కడ జరిగింది. నాడు కేసీఆర్‌కు 80కు పైగా సీట్లు వస్తాయని హెరాల్డ్ చెప్పగా అదే జరిగింది. ఈ పక్కా ప్లానింగ్ వెనక సంస్థల చైర్మన్ కోటిరెడ్డి నిరంత కృషి దాగి ఉంది.
అదేవిధం గా 2019 ఎన్నికల్లోఏపీలో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని ఏడాది ముందు నుంచే హెరాల్డ్ చెప్పుకొ చ్చింది. అదేవిధంగా కేంద్రంలో మోడీ రెండోసారి అధికారంలోకి వస్తారని చెప్పి సంచలనం సృస్టించింది. ఆ తర్వాత తెలంగాణలో హుజూర్‌నగర్, నాగార్జునా సాగర్‌తో పాటు ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని ముందే అంచనా వేసింది. ఇలా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో, ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్యక్తీకరించడంలోనూ.. హెరాల్డ్ ఫస్ట్‌లో నిలవడం గమనార్హం.