విజయం మీదే: భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలను ఇలా ఎదుర్కోండి ?

VAMSI
భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తడం సహజం. ఒకే ఇంట్లో కలిసుంటూ, కష్టసుఖాలను పంచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక సదర్బంలో ఏదో ఒక విషయం పై ఇరువురికి మనస్పర్ధలు రావడం సహజం. వాస్తవానికి అలా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఒకరి మనస్తత్వం మరొకరికి పూర్తిగా అర్థం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఆ చిన్న చిన్న గొడవల సందర్భంలోనే  ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవడం జరుగుతుందని అంటున్నారు. అప్పుడే భార్య, భర్తలు ఇరువురు ఎవరు ఏ మాటలకు ఎక్కువ బాధపడతారు. వారికి ఎలా  మాట్లాడితే నచ్చుతుంది, ఏ అంశాలు వారికి బాధ కలిగిస్తాయి అన్న విషయాలు తెలుస్తాయి.

 అంతే కాదు ప్రతి చిన్న గొడవ తర్వాత మళ్లీ వారి మధ్య కొత్త ప్రేమ చిగురిస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయ ఏంటంటే గొడవ మొదలైనప్పుడు, అది పెద్దది కాకముందే ఎవరో ఒకరు కాస్త తగ్గి మౌనంగా ఉండాలి. లేదా వీలైతే ఎదుటి వారి కోపం తగ్గేలా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఆ గొడవ పెను వివాదంగా మారకుండా ఉంటుంది. లేదంటే చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం లేక పోలేదు. అంతేకాదు ఎక్కడి గొడవలను అక్కడే ఎప్పటికప్పుడు మరచిపోవాలి. వాటిని అలాగే గుర్తు పెట్టుకుని సదర్బం వచ్చినప్పుడల్లా నువ్వు అలా అన్నావ్ ?  ఇలా అన్నావ్ ? అంటూ వాటిని గుర్తుచేసి గుచ్చి గుచ్చి మాట్లాడితే మరింత మనస్తాపాలు పెరుగుతాయి.

కాబట్టి ఎంతటి గొడవైనా మర్చిపోయి ముందు భవిష్యత్తును గుర్తు చేసుకుని సాగిపోవాలి. అపుడే దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. మాట మాట పెంచుకుంటే సమస్యల్లో పడేది మన జీవితమే అన్నది గుర్తుంచుకోవాలి. ఒకరి కోసం మరొకరు తగ్గడంలో ఏ మాత్రం తప్పులేదు. నిజానికి అదే మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది.  ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం అది మీకు నచ్చనపుడు సున్నితంగా వారికి అర్థమయ్యేలా తెలియచేయడం ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: