విజయం మీదే: గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి ?

VAMSI
మనుషుల మధ్యన అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. అవి ఆయా సందర్భాలను బట్టి బయటకు వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఇవి ఇలాగే కొనసాగితే ఎటువంటి సమస్య ఉండదు. కానీ మనలో ఉన్న ఈ ఫీలింగ్స్ కొన్ని సార్లు అవసరానికి మించి చూపిస్తే మనుషుల మధ్య బంధాలు తెగిపోతాయి. ముఖ్యంగా భార్యా భర్తల మధ్యన ఎంతో అన్యోన్యత ఉంటుంది. ఎందుకంటే వారు జీవితాంతం ఒకరికి ఒకరి కలిసుండాలి. చచ్చే వరకు కలిసి ఉండాలి. కానీ కొన్ని సార్లు కలిగే వివాదాల వలన ఇగోలకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మానసికంగా ఇబ్బంది కలిగితే ఈ ఒత్తిడిని ఎవరిపై చూపించాలో తెలియక, ఇలాంటి గొడవలు జరుగుతాయి. ఇప్పుడు కరోనా కారణంగా సుదీర్ఘ లాక్డౌన్ తో ప్రజలు ఇళ్లలో బంధీలుగా మారడంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింది.
ముఖ్యంగా పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక తమ భార్యలపై చూపించారని, ఫలితంగా మహిళలపై హింస గరిష్ట స్థాయికి చేరుకుందని అర్ధమవుతోంది. అయితే కేవలం పురుషుల్లోనే ఇలా జరగడానికి కారణం ఏమిటని చూస్తే...మామూలు సమయంలో జాబ్ కి వెళ్ళిపోతారు. సాయంత్రం ఇంటికొస్తారు హ్యాపీగా భార్యతో ఉంటారు. కానీ ఇప్పుడు 24 గంటలు భార్యతోనే ఉండాలి. దీనితో అసహనం పెరిగిపోతోంది. కానీ ఇలా చెయ్యడం చాలా పొరపాటు అని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఒకరికి ఒకరు గౌరవంగా మెలుగుతారో..అప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. ఆ గౌరవమే మీ మధ్యన బంధాన్ని బలంగా చేస్తుంది.
ఎప్పుడైతే మీ భార్యకు కలిగే నొప్పిని మీ నొప్పిగా ఫీల్ అవుతారో ఇంకోసారి మీరు ఆమెను ఇబ్బంది పెట్టలేరు. ఇది ఇలాగే కొనసాగిస్తే మీరు ఇంకొకరికి స్ఫూర్తిగా ఉండొచ్చు. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. ముందుగా ఒకరినిమించి ఒకరు ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలి. కేవలం ఇది కూడా మీకు ఒక శిశువు జన్మించక ముందు వరకే, తరువాత మీ బిడ్డతో గడపడానికే మీకు సమయం సరిపోదు. ఇలా చిన్న చిన్న విషయాలను తెలుసుకోలేక ఎంతోమంది చిన్న వయసులోనే తమ జీవితాలను కోల్పోతున్నారు. మాములుగా సినిమాలో కొన్ని డైలాగులు వస్తుంటాయి....వీలైతే ప్రేమిద్దాం ..మహా అయితే తిరిగి ప్రేమిస్తారు...అన్నట్లు ప్రేమించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: