విజయం మీదే: ధైర్యమే మీకు శ్రీరామరక్ష...?

VAMSI
మనకు ప్రాణం ఉన్నప్పుడే అది జీవితం అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ప్రాణాన్ని నిలబెట్టే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరం. మనం ఇప్పుడు కంటికి కనిపించని కరోనా అనే శత్రువుతో పోరాడుతున్నాం. అందులోనూ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఓ వైపు ఈ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు, ప్రభుత్వాలు మరియు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఎంతో మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు... ఇది మన ప్రాణానికి ప్రమాదకరం కావచ్చు. జీవితంపై ఆశ ఉన్న ఏ వ్యక్తి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించరు...ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలతో వైరస్ బారిన పడకుండా ఉండడానికి నిబంధనలు పాటిస్తారు.

కరోనాను జయించడానికి బలమైన ఆహారం తీసుకోవడం ఎంతో ప్రధానం. కరోనా వైరస్‌తో పోరాడేందుకు మనకు విటమిన్లు A, B, C, D, E తోపాటూ.. మినరల్స్, ఐరన్, సెలెనియం, జింక్ తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం మన జీవన శైలిలో అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిలో క్యారెట్, ఆరెంజ్ బనానా,  ఆకు కూరలు, నాన్ వెజ్ వంటి బలమైన ఆహారం తీసుకోవాలి. ఇక పోతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు చూస్తే కరోనా ఉన్న వారిలో కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, వినికిడి సమస్య, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకొని, ఓ వైపు బలమైన ఆహారం తీసుకుంటూనే మరో వైపు డాక్టర్ల సలహామేరకు వైద్యాన్ని తీసుకోవాలి. తీసుకున్న వైద్యం మిమ్మల్ని కొంత మేరకు కాపాడుతుంది. కానీ మీరు వ్యాధి ఉందని ఎటువంటి ఆందోళన చెందకూడదు. ఇటువంటి ఆందోళనే మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి మనో ధైర్యంతో ఉండాలి. ఎటువంటి భయం కలిగి ఉండకూడదు. మన ధైర్యమే మనల్ని కాపాడుతుందని గుర్తించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: