విజయం మీదే: మీకు ఉన్న దానితో తృప్తిపడు...!

VAMSI
జీవితంలో ప్రతి ఒక్కరికీ డబ్బు మీద ఆశ ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఆశ ఉండడం వలన తోటి మనుషుల మీద కూడా యూటువంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. లేని మరియు రాని సంపద కోసం పాకులాడకూడదు. ఉన్న దానితో తృప్తిగా ఉండాలి. అలాంటి విషయాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు మనము తెలుసుకుందాము.  

భారతదేశానికి దక్షిణ తీరాన ఒక చిన్న పట్టణంలో ఒక పాతికేళ్ళ యువకుడు ఉండేవాడు. సంపదలపై తనకున్న అమితమైన ప్రేమతో అతని పదమూడవ ఏట నుండి చేయని ప్రయత్నమే లేదు. అందుకోసం అతని బాల్యపు సంతోషాలని, స్నేహితుల ముచ్చటలని, ఆటపాటలన్నిటిని త్యాగం చేసాడు. ఎంత ప్రయాసపడినా అతను అపర కుబేరుడు అవ్వాలన్న ఆశ అంచుకి కూడా చేరుకోలేకపోయాడు. ఒక రోజు బిక్షాటనకు వచ్చిన ఒక పండు ముసలి సన్యాసి బిక్ష కోసం వస్తూ దీర్ఘాలోచనలో ఉన్న ఆ యువకుని వద్ద నిలిచి యాచించాడు. బిక్షగాడిని చూసి ఆ యువకుడు మిక్కిలి కోపంతో అతని జీవితాన్ని చులకన చేస్తూ హేళన చేసాడు.  మీ బోటి యాచకులను చూడటం కూడా పాపం అని, దాని వలన అపరకుబేరుడు అవ్వాలన్న తన ఆశయంలో నిరుత్సాహం కలుగుతుందని తిట్టి పంపించబోయాడు.

యువకుని అభిలాషను గమనించిన ఆ ముసలి సన్యాసి దానికోసం అతని వద్ద ఒక మార్గం ఉందని, దానిని అనుసరించడం వలన అనుకున్నది తప్పక నెరవేరుతుందని చెప్పాడు. వృద్దుని మాటలకు చిరాకు పడుతూ ఆ యువకుడు నిజంగా అన్ని మార్గాలు నీకు తెలిస్తే నా వద్ద ఇలా చేతులు చాచి యాచించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించాడు. ముసలి సన్యాసి చిన్నగా నవ్వి కుబేరుడు కావాలన్నది నీకు మాత్రమే ఆశయం, నాకు అలాంటి ఆశయం లేదు అన్నాడు.
యువకుడు ఆశ్చర్యపోయాడు. ఈ భూమిపై డబ్బుని ప్రేమించని మనిషి ఉంటాడా అని అనుకున్నాడు. అప్పుడు ఆ ముసలివాడు నాకు ఏదైతే ఉందో దానితో నేను సంతసంగానే ఉన్నాను. నాకు లేని దాని గురించి నేనెప్పుడూ సమయాన్ని వృధా చేసుకోను.. కాబట్టి నీకున్న సంపదతో తృప్తి పడు. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది దక్కుతుందన్నాడు. మీరే తెలుసుకోండి లేని దాని కోసం ఆరాటం ఎందుకు. ఉన్న దానితో సంతోషంగా ఉండడమే నిజమైన జీవితం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: