విజయం మీదే : అనంతమైన ఓర్పు, పట్టుదల ఉంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనలో నూటికి నూరు శాతం మంది సక్సెస్ సాధించాలనే లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. కానీ 20 నుంచి 30 శాతం మంది మాత్రమే సక్సెస్ సాధించి విజేతలుగా నిలుస్తారు. వీరు మాత్రమే సక్సెస్ సాధించటానికి కారణాలేమిటనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. మిగతా వారితో పోలిస్తే వీరిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలే వీళ్లు సక్సెస్ సాధించడానికి కారణమవుతాయి. ఆ లక్షణాలే వీళ్లు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగటానికి దోహదపడతాయి. 
 
ఎవరైతే ఓర్పు, పట్టుదల లాంటి లక్షణాలను కలిగి ఉండి సక్సెస్ కోసం శ్రమిస్తారో వారు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ప్రతి మనిషి సక్సెస్ లో ఓర్పు, పట్టుదల కీలక పాత్ర పోషిస్తాయి. మనిషిలో ఓర్పు లేకపోతే తగిన శ్రమ లేకుండానే విజయం కావాలని ఆశిస్తాడు. అలాంటి వారు కెరీర్ లో, అనుకున్న పనిలో సక్సెస్ సాధించడం సాధ్యం కాదు. పట్టుదల లేకపోయినా విజయం సొంతం కాదు. 
 
ఎవరికైతే పట్టుదల ఉంటుందో వాళ్లు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటం ఆపరు. చివరి నిమిషం వరకు సక్సెస్ కోసం శ్రమిస్తూనే ఉంటారు. మధ్యలో ఆటంకాలు, సమస్యలు వచ్చినా ప్రయత్నాలను ఆపరు. మనల్ని బలహీనులుగా మార్చడానికి ఎదుటివాళ్లు ప్రయత్నిస్తున్నా ఆ మాటలను లెక్క చేయరు. సక్సెస్ సాధించే వరకు ఎన్ని సమస్యలు వచ్చినా శ్రమిస్తూనే ఉంటారు. 
 
ఈ రెండు లక్షణాలు ఉన్నవాళ్లకు విజయం తప్పనిసరిగా సొంతమవుతుంది. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఆలస్యంగానైనా విజయం సాధిస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత విజేతగా నిలిచే చివరి నిమిషం వరకు ప్రయత్నాలను ఆపరు. ఈ విధంగా కష్టపడితే మాత్రం జీవితంలో సక్సెస్ తప్పక సొంతమవుతుంది. ఈ లక్షణాలు లేకుండా కష్టపడితే మాత్రం కెరీర్ లో సక్సెస్ సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: