విజయం మీదే : ఎంత కష్టమైన పనైనా పోరాడే తత్వం ఉంటే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ఈ ప్రపంచంలో మనకు ఎంత టాలెంట్ ఉన్నా.... శ్రమించే గుణం ఉన్నా అవతలి వ్యక్తులకు అవి అనవసరం. మనం సక్సెస్ సాధించామా....? లేదా...? అనే విషయాన్ని మాత్రమే సమాజం పరిగణనలోకి తీసుకుంటుంది. విజయం సాధించిన వ్యక్తులకు మాత్రమే గౌరవం లభిస్తుంది. మనలో ఎన్నో మంచి గుణాలు ఉండి, సాధించే సత్తా ఉండి సక్సెస్ కాలేకపోతే అది కేవలం మన ప్రణాళికా లోపమే. 
 
మనం సక్సెస్ సాధించాలంటే మనలో పోరాడే తత్వం ఉండాలి. ఎంత కష్టం వచ్చినా పోరాడి ఎదురు నిలిచే సత్తా ఉండాలి. జీవితంలో చెడు స్నేహాలకు ఎల్లవేళలా దూరంగా ఉండాలి. ఇతరులు ఇచ్చే చెడు సలహాలను పక్కన పెట్టాలి. సరైన ప్రణాళికతో లక్ష్యానికి అనుగుణంగా శ్రమించాలి. ఎంచుకున్న లక్ష్యానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి. ఇతరులపై ఆధారపడి జీవించడం మానుకోవాలి. 
 
మనకు సబ్జెక్ట్ లో తెలియని విషయాలను, అర్థం కాని విషయాలను ఇతరుల ద్వారా తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఈ విధంగా కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసిన వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన విధంగానే ఫలితం కూడా ఉంటుంది. 
 
అయితే సరైన ప్రణాళికతో కూడిన లక్ష్యమే మంచి ఫలితాలను ఇస్తుంది. లక్ష్యం సాధించటానికి ప్రయత్నించే తొలిరోజు మనలో సాధించాలనే కోరిక ఎంత ఉంటుందో చివరి రోజు వరకు అదే విధంగా ఉండాలి. మనకు లక్ష్యాన్ని సాధించాలనే కోరిక బలంగా ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం లభిస్తుంది. విజయానికి మంచి వ్యూహం తప్పనిసరిగా కావాలి. ఎవరైతే మంచి వ్యూహంతో ముందడుగులు వేస్తారో వారు ఆ పనిని సులభంగా సాధించగలరు.                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: