విజయం మీదే : ఓటమిని అంగీకరించే వాళ్లు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతారు

Reddy P Rajasekhar

ప్రపంచం ఎల్లప్పుడూ సక్సెస్ చుట్టూ తిరుగుతుంది. సక్సెస్ లో ఉన్నవాళ్లకు సమాజంలో ఎంతో విలువ ఉంటుంది. ఎంతో మంది సక్సెస్ కోసం ప్రయత్నిస్తే కొంతమందికి మాత్రమే సక్సెస్ సొంతమవుతుంది. ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించటం సాధ్యం కాదు. అలంటి వాళ్లు వరుస ఓటముల తర్వాత తాము జీవితంలో ఎందుకు పనికిరామని, తమకు సక్సెస్ అందుకోవడం సాధ్యం కాదని అనుకుంటూ ఉంటారు. 
 
నిజానికి చాలా మంది సక్సెస్ కాలేకపోవడానికి వివిధ కారణాలు ఉంటాయి. కొందరు సక్సెస్ కాలేకపోవడానికి ప్రయత్న లోపం కారణమైతే మరికొంతమంది నిర్లక్ష్యం వల్ల, ఇతర కారణాల వల్ల సక్సెస్ ను సొంతం చేసుకోలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. నిజానికి సక్సెస్ పొందాలనుకునేవారు మొదట చేసే పనిలో లేదా పరీక్షల్లో ఫెయిల్ అయితే ఓటమిని అంగీకరించాలి. ఆ ఓటమిని అంగీకరించలేకపోతే ఎప్పటికీ విజయం అందుకోవడం సాధ్యం కాదు. 
 
ప్రతి ఒక్కరూ మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోలేరు. కొందరు మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయితే మరికొందరికి సక్సెస్ సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. మనం ఏ విషయంలోనైనా ఫెయిల్యూర్ అయ్యామంటే మొదట ఆ ఫెయిల్యూర్ కు గల కారణాలను విశ్లేషించాలి. జరిగిన తప్పులను, పొరపాట్లను గుర్తించుకోవాలి. ఓటమి పొందటానికి మన బలహీనతలే కారణమైతే ఆ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించాలి. 
 
అవసరమైతే ఇతరుల సలహాలు, సూచనలు స్వీకరించి ముందడుగులు వేయాలి. మన తప్పులను గుర్తించి ఓటమిని అంగీకరిస్తే మాత్రమే సులభంగా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓటమి విజయానికి తొలి మెట్టు అనే సామెతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. గెలుపు సాధించే క్రమంలో సమస్యలు ఎదురైనా నిరాశానిస్పృహలకు లోను కాకుండా ప్రయత్నం చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది.             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: