మహిళల అవకాశ్యత ను తెలిపే సదస్సు.. ఎంతోమందికి స్పూర్తిదాయకం..!!

Mamatha Reddy
ప్రతి సంవత్సరం దేశ పురోగతిలో, అభివృద్ధిలో మహిళల ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. పలు సర్వే సంస్థలు సర్వే లు నిర్వహించి ఈ విషయాన్ని ఇప్పటికే నిరూపించాయి. ఆ విధంగా ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ హండ్రెడ్ వుమెన్ సిరీస్ అనే పేరిట స్ఫూర్తిదాయకమైన ప్రభావంతమైన కొంతమంది మహిళల గాధలను ప్రపంచ వ్యాప్తంగా పాఠకు ల ముందుకు తీసుకువస్తుంది. అలా చాలా మంది మహిళలు వివిధ రంగాల్లో కృషి చేసిన కథలను వినిపిస్తోంది. 2013లో ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సదరు సంస్థ ఇప్పుడు ఆరో సంవత్సరంలో కి అడుగుపెట్టింది.

ఈ సందర్భంగా మరొకసారి మహిళల పట్ల తమకున్న గౌరవాన్ని చూపించింది. మేకప్ ఎంటర్ ప్రేన్యు యర్ బాబీ బ్రౌన్, ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్, బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్, అత్లేట్ సైమన్ బైల్స్, సూపర్ మోడల్ అలెక్ వెక్,మ్యుజిషియన్ అలిసియ కీస్, ఒలంపిక్ ఛాంపియన్ బాక్సర్ నికొలా ఆడమ్ ఇలా వేరు వేరు రంగాలకు చెందిన మహిళలు బిబిసి 100 వుమెన్ కు ఎంపికయ్యారు.

పురుషాధిపత్యం సాగుతున్న ఈ ప్రపంచం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది దానిని ఎలా తీర్చిదిద్దాలి అనేది ఈ బి బి సి హండ్రెడ్ ఉమెన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం  అ ని చెబుతున్నారు . 2019 సీజన్ లో ప్రధానంగా రెండు ఫ్యూచర్ సదస్సు లు జరిగాయి. మొదటి అక్టోబర్ 17న,  రెండోది అక్టోబర్ 22న వేర్వేరు నగరలలో లో జరిగాయి. సైన్స్, కళలు, మీడియా, విద్య, మతం, అంతరిక్షం, లింగ సమానత్వం, వంటి రంగాల్లో కృషి చేస్తూ భవిష్యత్తు ను మార్చగల సామర్థ్యం ఉన్న మహిళలు ఈ సదస్సులో  పాల్గొన్నారు. మహిళల్లో ఉత్తేజం నింపడానికి వారిలో స్ఫూర్తిను నింపే విషయాలు కలిగించడానికి ఈ సదస్సు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: