తన యాప్ తో యాపిల్ సంస్థనే మెప్పించిన యువతి

Mamatha Reddy
ప్రస్తుతం పెరిగిపోతున్న టెక్నాలజీ ఇప్పటి యువతరం లో ఎంతో స్ఫూర్తి నింపుతుంది. టెక్నాలజీ తగ్గట్టుగా పిల్లలు కూడా మారుతూ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు అద్భుతాలు చేస్తున్నారు. చిన్నవయసులోనే ఎన్నో ఘనతలు సాధిస్తూ పెద్దవారిని సైతం అబ్బురపరుస్తున్న వారిలో ఒకరు ఇండో అమెరికన్ అభినయ దినేష్. ఏకంగా ఆపిల్ కంపెనీ నే తాను తయారు చేసిన ఒక యాప్ తో మెప్పించింది అంటే ఆమెకు టాలెంట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది పాల్గొన్న ఈ పోటీలో విజేతగా నిలిచిన ఈ 15 సంవత్సరాల అమ్మాయి ఎంతోమంది తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఆదర్శంగా నిలిచి వారికి రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఇటీవల ఆపిల్ నిర్వహించిన డబ్ల్యూ డబ్ల్యూ డి సి 21 స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్ లో ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని వేల మంది ఇందులో పాల్గొనగా 350 మంది విజేతలుగా నిలిచారు. ఇందులో అభినయ కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె న్యూజెర్సీలో నివసిస్తుండగా గ్యాస్ట్రో ఎట్ హోమ్ అనే యాప్ ను తయారుచేసి సరికొత్త ట్రెండ్ సృష్టించింది. 

జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ యాప్ ను రూపొందించింది అభినయ. కొన్ని ఆరోగ్య సమస్యల గురించి నేరుగా ఇతరులతో చర్చించలేము. ఇలాంటి ఇబ్బందులకు ఇది చక్కటి పరిష్కారం అంటోంది అభినయ. ఈ యాప్ త్వరలోనే ప్లేస్టోర్ లో స్థానం పొందుతుంది. అంతేకాకుండా ఇంపాక్ట్ ఏఐ అనే లాభాపేక్షలేని సంస్థ ను కూడా అభినయ నిర్వహిస్తుండడం గర్వకారణం. దీని ఆధ్వర్యంలో గర్ల్స్ ఇన్ ఏఐ అనే ఎనిమిది వారాల హైస్కూల్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది. ఇంత చిన్న వయసులోనే చక్కని ప్రతిభ కనపరుస్తున్న అభినయ చాలా గ్రేట్ కదు.. భవిష్యత్తులో ఆమె ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: