అమ్మ : కడుపులోని మీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే తప్పకుండా ఇవి తినాలి.. !!

Suma Kallamadi
తల్లి అవ్వడం ప్రతీ మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి.బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రతి మహిళ ఎంతగానో ఎదురుచూస్తుంది.అయితే  ప్రెగ్నన్సీ మహిళలు కడుపుతో ఉన్నపుడు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.తినే తిండి విషయంలో పోషకాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే  మీరు తీసుకునే  ఆహారంను బట్టే మీ బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉంటుంది . బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే  మేము ఇప్పుడు చెప్పబోయే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సిందే. మరి అవేంటో చూద్దామా!ప్రెగ్నన్సీ మహిళలు తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం, లవణాలు ఉంటాయి.


కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు సిట్రస్ పండ్లు తీసుకోవాలి.సిట్రస్ పండ్లలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బీట్ రూట్ మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.పాలు, మాంసం, గుడ్లు, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది.అలాగే కడుపుతో ఉన్న మహిళ రోజుకి కనీసం ఒక గుడ్డు అయినా తినాలి. ఉడకబెట్టిన కోడిగుడ్డు మాత్రమే తినాలి.

అలాగే ఆకుకూరలు కూడా తినాలి. ఆకుకూరలు తినడం వల్ల రక్తం ఎక్కువగా పడుతుంది. గర్భిణీ స్త్రీలుతగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆకుకూరలు, బెల్లం, రాగులు, కర్జూరం, ద్రాక్ష, నువ్వులు, చెఱకు రసం, ఉలవలు వంటివి తీసుకోవాలి.గర్భిణీలలో రక్తహీనత ఉంటే శిశువు తక్కువ బరువుతో పుడతారు. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.ఒకవేళ గర్భిణీ స్త్రీ కి ఆపరేషన్ చేయవలిసిన పరిస్థితి వస్తే రక్తం ఎక్కువగా పోతుంది. కావున రక్త శాతం అనేది ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా బరువు పనులు చేయకూడదు. ఇలా ఎక్కువ బరువు మోయడం వల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం జరగవచ్చు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: