గోంగూర పులిహోర ఇలా కలుపుతారా?

Durga Writes

పులిహోర.. మీరు అనుకున్నది కాదు.. గోంగూర పులిహోర గురించి ఇక్కడ చెప్తుంది. ఈ పులిహోర ఎంత తిన్న ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది.. అంత రుచిగా ఉంటుంది ఈ గోంగూర పులిహోర. అయితే ఈ పులిహోర ఎలా చేస్తే అంత బాగుంటుంది.. ఎలా కలిపితే బాగుంటుంది అనేది ఇక్కడా చదివి తెలుసుకోండి. ఇంట్లోనే చేసుకొని తినండి. 

 

కావలసిన పదార్ధాలు.. 

 

బియ్యం - రెండు కప్పులు, 

 

పసుపు - అర టీస్పూన్‌, 

 

కరివేపాకు - ఒక కట్ట, 

 

ఉప్పు - తగినంత, 

 

గోంగూర - రెండు కట్టలు, 

 

ఆవాలు - ఒక టీస్పూన్‌, 

 

మెంతులు - అర టీస్పూన్‌, 

 

ఎండు మిర్చి - రెండు, 

 

సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

ఆవాలు - ఒక టీస్పూన్‌, 

 

జీలకర్ర - పావు టీస్పూన్‌, 

 

ఎండు మిర్చి - రెండు, 

 

పచ్చిమిర్చి - మూడు, 

 

ఇంగువ - చిటికెడు, 

 

నూనె - తగినంత.

 

తయారీ విధానం... 

 

ముందుగా పొడి పొడిగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక గోంగూర వేగించాలి. పది నిమిషాలు వేగిస్తే గోంగూర పచ్చిదనం పోతుంది. 

 

తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత గోంగూర వేసి పేస్టు మాదిరిగా పట్టుకోవాలి. మళ్లీ పాన్‌లో నూనె వేసి ఆవాలు, ఎండు మిర్చి, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేగించాలి. పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత గోంగూర పేస్టులో వేసి కలపాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నంలో గోంగూర పేస్టు, తగినంత ఉప్పు వేసి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: