ఉసిరికాయ- పులిహోర

Durga
కావలసిన పదార్థాలు :  ఉసిరికాయలు : 8 బియ్యం : 1/2కేజీ ఆవాలు : 1/2టీస్పూన్ శెనగపప్పు : 2 టీస్పూన్ పల్లీలు : 2 టీస్పూన్ మినప్పప్పు : 1 టీస్పూన్ కరివేపాకు : 1 కట్ట పసుపు : 1/4 టీస్పూన్ ఎండుమిర్చి : 4 పచ్చిమిర్చి : 5 పంచదార : 1/4 టీస్పూన్ నూనె : నాలుగు టీస్పూన్ ఉప్పు : తగినంత. తయారీ విధానం:  ఉసిరికాయల్లో గింజ తీసి ఉప్పు చేర్చి ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి ముద్దలా చేయాలి. అన్నం వండి చల్లార్చాలి. ఒక బాణెలి లో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి వేయించి దించేముందు పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి వేయాలి. ఈ మిశ్రమాన్ని వండి చల్లార్చి ఉంచిన అన్నంలో కలిపి ఉప్పు సరిచూడాలి. చివరగా పంచదార కూడా వేసి కలిపి ఓ గంటసేపు అలాగే ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉండే పులిహోర రెడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: