విజయం మీదే : ఆలోచనలను సక్సెస్ కు ఆయుధాలుగా మార్చుకుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్ష్యాన్ని సాధించాలనుకునేవారు నిత్యం లక్ష్యసాధన కోసమే శ్రమించాలి. కార్యసాధన లేకుండా విజయం సాధించడం ఎవరికీ సాధ్యం కాదు. స్పష్టమైన ప్రణాళికతో మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుంది. తక్కువ కష్టపడితే ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. కెరీర్ లో సక్సెస్ కావాలంటే ప్రతి వ్యక్తికి నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. 
 
అలా కాకుండా ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తికి సక్సెస్ సొంతం కాదు. విద్యార్థి, వ్యాపారి, ఉద్యోగి... ఇలా ఎవరైనా లక్ష్యం లేకుండా పనిని ప్రారంభిస్తే ఎప్పటికీ విజయం సొంతం కాదు. లక్ష్యాన్ని సాధించాలనుకునే వాళ్లు విజయాన్ని కాగితంపై రాసుకుని మనో నేత్రంతో ముద్రించుకుంటారు. నిరంతరం లక్ష్యాన్ని సాధించడం కోసం శ్రమిస్తారు. లక్ష్యం సాధించకపోవడం కాదు, లక్ష్యం లేకపోవడం అత్యంత దురదృష్టకరం. మనలో ప్రతి ఒక్కరికీ సక్సెస్ కావాలనే కోరిక ఉంటుంది.   
 
అయితే విజయం సాధించాలంటే కోరిక ఉంటే సరిపోదు. జ్వలించే కోరికలు ఉన్నవాళ్లు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. మంచైనా, చెడైనా మన ఆలోచనలే చివరకు వాస్తవాలవుతాయి. విజయం సాధించే వ్యక్తులు ఆశావహ దృక్పథంతో పెద్ద ఆలోచనలను అవకాశం కల్పిస్తారు. మన ఆలోచనలే మాటలై చేతలవుతాయి. మనం సక్సెస్ సాధించలేం అనే భావనలో ఉంటే మాత్రం నిజంగానే సక్సెస్ సొంతం కాదు. 
 
మనలో ప్రతి ఒక్కరికీ రోజులో 24 గంటల సమయమే ఉంటుంది. అయితే ఆ సమయాన్ని ఏ విధంగా వినియోగించుకున్నామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే మనం లక్ష్యాన్ని సాధించడానికి ఇష్టంతోనే ప్రయత్నించాలి. ఒత్తిడి, నిద్రలేమి, నిర్లక్ష్యపు ఆహార అలవాట్లతో విజయం సాధించినా వృథానే. మన ఆలోచనలను సక్సెస్ కు అనుగుణంగా మార్చుకుంటూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తే ఏ పనిలోనినా విజయం సాధించడం సాధ్యమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: