కొత్త రకం మోసం..ఓటీపీ లేకుండానే అకౌంట్ లో డబ్బులు మొత్తం దొబ్బేస్తున్నారు రా బాబోయ్..!
మహమ్మద్ .. ముజాఫర్పూర్ లోని మధురాపూర్ పటికల్లో నివసిస్తూ ఉంటాడు. ఆయనకు తెలియని ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది . సాధారణంగా తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే ఎత్తడు మహమ్మద్. కానీ పదే పదే కాల్ చేస్తూ ఉండడంతో ఏదో తెలిసిన వాళ్ళ నెంబర్ అయుంటుంది అంటూ లిఫ్ట్ చేశారు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను బంధన్ బ్యాంకు కి సంబంధించిన ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడట . అలాగే కే వై సీ పూర్తి చేయడానికి ఆధార్ - పాన్ కార్డు వివరాలు అవసరం అంటూ అడిగరాట. అయితే ఎక్కడో తేడా కొట్టిన మహమ్మద్ నేను బ్యాంకుకు వెళ్లే కేవైసీ చేస్తాను అంటూ గట్టిగానే చెప్పాడట .
అయినప్పటికీ ఎటువంటి ఓటీపీ లేకుండా మోసగాళ్లు అనేక విడతలుగా డబ్బులను దోచేసుకునారట. మహమ్మద్ కి తెలియకుండానే ఆయన అకౌంట్లో ఉన్న ఐదు లక్షలు విత్ డ్రా చేసేసుకున్నారు ఆ సైబర్ నేరస్తులు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు అని జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. సైబర్ నేరస్తులు ఓటిపి లేకుండా కూడా మోసం చేస్తున్నారు అని .. మీకు తెలియని నెంబర్ నుంచి ఏదైనా కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి అని మరీ ముఖ్యంగా నెంబర్ మీకు డిఫరెంట్ గా అనిపిస్తే అసలు లిఫ్ట్ చేయకపోవడం బెటర్ అని చెప్తున్నారు . అంతేకాదు ఎవరైనా సరే మీ వ్యక్తిగత సమాచారం ఆధార్ బ్యాంక్ ఖాతా ఇలాంటివి అడిగితే అస్సలు ఇవ్వద్దు అని ఈమెయిల్ - ఫోన్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చూస్తే వాళ్ళను బ్లాక్ చేసేయండి అని చెప్పుకొస్తున్నారు. ఓటిపి లేకుండా కూడా ఇలా డబ్బులు దోచేసుకునే కొత్త రకం మోసాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్నారు..!