
వైరల్: తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రాంతాలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
బెజవాడ:
దీన్ని విజయవాడ అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వపు రోజుల్లో కృష్ణానది బంగాళాఖాతంలో కలవడం కోసం ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉన్నదట. అలా ఎన్నో పర్వతాలు ఈ నదికి అడ్డుగా వచ్చేవట. దీంతో కృష్ణమ్మ అర్జునుడిని వేడుకోగా.. ఆ పర్వతాలకు రంద్రం (బెజ్జం) చేశారట. ఈ ప్రాంతాన్ని బెజ్జం వాడ అనే పేరు కూడా పిలిచేవారట.ఆ తర్వాత బెజవాడగా మారి విజయవాడగా మారిపోయింది.
భాగ్యనగరం:
మహమ్మద్ కూలి కుతుబ్షా తాను ప్రేమించిన భాగమతి అనే ఒక నృత్యకారి పేరు మీదుగా ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరుని పెట్టారట. ఆ తర్వాత ఆమె అతడిని పిల్లాడి ఇస్లాంలోకి మారిందట. ఆ తర్వాత హైదర్ మహల్ గా గుర్తింపు రావడంతో భాగ్యనగరం కాస్త హైదరాబాద్ గా మారింది..
వాల్తేరు:
ప్రస్తుతం దీనిని విశాఖపట్నం గా పిలుస్తూ ఉన్నారు.
గడప:
ఒకప్పుడు తిరుమలకు వెళ్లేందుకు ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచే వెళ్లేవారట. అందుకే దీనిని గడప అని పిలిచేవారు రాంగ్ రాంగ్ ఇది కడప గా మారిపోయింది.
గుంటూరు:
ఒకప్పుడు దీన్ని గుర్తుపురి అని పిలిచేవారట.. ఈ ప్రాంతం చాలా ఘాటుగా ఉండేదని మిరపకాయలకు ఫేమస్ కావడం చేత దీనిని గుంటూరుగా పరిగణించారు.
పాలమూరు: నిజాం కాలంలో ఎక్కువగా ఇక్కడ వారు పాలు అమ్మేవారు కాబట్టి పాలమూరు అనే పేరు వచ్చిందట.
కర్నూల్:
గతంలో ఈ ఊరిని కందెనవోలు అని పిలిచేవారట.. పూర్వపు రోజుల్లో ఎడ్ల బండికి గ్రీజు ఈ ప్రాంతంలో తుంగభద్ర నది వద్ద పెట్టేవారట అందుకే ఈ ప్రాంతాన్ని కందినవోలు అని పిలిచేవారట ఆ తర్వాత అది కర్నూలుగా మారిపోయింది.
కాకినాడ:
డచ్వారు మన దేశాన్ని పరిపాలించే సమయంలో ఇక్కడి నుంచి కొబ్బరికాయలు విదేశాలకు తరలించే వారట అప్పట్లో కోకోనాడ అని పిలిచేవారట. చివరికి అది కాకినాడగా మారిందట.
ఓరుగల్లు:
దీన్ని ప్రస్తుతం వరంగల్ గా పిలుస్తున్నారు.. ఇక్కడ ఏకశిలా నగరం కోమటి కొండ అనే పేర్లు ఉండేవట.. ముఖ్యంగా ఇక్కడ వరంగల్ కోటను ఓకే గ్రానైట్ పైన శిల్పాల పైన చెక్కారట. అందుకే దీనికి వరంగల్ అనే పేరు వచ్చింది.