వ్యూస్ కోసం.. రైలు పట్టాలపై యువతీ అసభ్య ప్రవర్తన.. వైరల్ వీడియో?

praveen
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతున్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఇంటర్నెట్లో చూస్తూ కాలం గడిపేస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలని అనుకుంటూ ఉన్నారూ. పాపులారిటీ అనేది ఊరికే రాదు కదా. అందుకే ఏదో ఒకటి విచిత్రమైన పని చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు కొంతమంది. అయితే ఏకంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మరి పిచ్చి పనులు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించాలి అనే పిచ్చితో ఎంతో మంది విచిత్రమైన పనులు చేస్తూ ఉన్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక మహిళ కూడా ఇలాంటి పిచ్చి పని చేసింది. సోషల్ మీడియాలో లైక్ కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టింది. రైలు పట్టాలపై ఏకంగా ట్రైన్ కి ఎదురుగా వెళ్ళింది యువతి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

 సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ లోని బహేదీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ఎలాగైనా ఇంటర్నెట్లో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక మహిళా రైలు పట్టాల పైకి వెళ్ళింది. చీరను అసభ్యకర స్థితిలో ధరించడమే కాకుండా రైలు పట్టాలపై నడుస్తూ వీడియో చేసింది. అంతటితో ఆగని ఆమె ఎదురుగా రైలు రావడం చూసి అలాగే నడుస్తూ ఉంది. ఇక ఈమె చేసిన పనికి అక్కడున్న వారందరూ కూడా భయాందోళనకు గురి అయ్యారు. రైలు పట్టాల నుంచి దూరంగా వెళ్లాలని అరుపులు కేకలు పెడుతున్న ఆమె మాత్రం పట్టించుకోలేదు. ఇక ఈ అమ్మాయి చేసిన పనికి చివరికి రైలు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. తాజా రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: