వైరల్: అడవి దున్నల పుర్రెల పర్వతం ఎక్కడ ఉంది.. దీని కథ తెలుసా..?
ఇద్దరు వ్యక్తులు నల్లటి సూట్, బౌలర్ టోపీ ధరించిన వ్యక్తులు ఈ పుర్రల కొండమీద నిలబడి ఫోటోలకు సైతం ఫోజులు ఇచ్చారు. ఒక్క చక్కని వరుసలో పేర్చిన ఈ వేలాది పుర్రెలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.. అయితే ఈ పుర్రెలు 19వ శతాబ్దానికి చెందిన ఫోటో అన్నట్లుగా తెలుస్తోంది.. ఈ భయంకరమైన ఫోటోలో వెనుక ఒక చీకటి రహస్యం కూడా ఉన్నదట.. స్థానిక ఇండియన్ లను అమెరికా నుంచి పంపేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి.. అక్కడ ప్రధాన ఆహార వనరమైన అడవి దున్నలను సైతం లేకుండా చేసి బలవంతంగా అక్కడి నుంచి ప్రజలను పంపించాల్సిన పరిస్థితిని కల్పించే ప్రయత్నాలకు నిదర్శనంగానే ఈ పుర్రెలు అన్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
అడవి దున్నల నిర్మూలన అనేది కూడా వలస రాజ్యాల విస్తరణలో ఒక వ్యూహాత్మకమైన భాగం అని తెలిపారు.. పశ్చిమ దేశాలలో ఎక్కువగా వీటిని మచ్చిక చేసుకునేవారని.. నివాసయోగ్యమైన ప్రదేశంగా అటవీ భూమిని ఆక్రమించుకోవడానికి ఈ జంతువుల నిర్మూలనలో ఒక భాగం అని తెలిపారు. అయితే ఈ జంతు నిర్మూలన అనేది జీవనోపాధి కోసం ఆధారపడిన వారికి శాశ్వతంగా దెబ్బతీసిందట. అయితే వీటి ప్రభావం ఇప్పటికీ కూడా కనబడుతున్నాయట.. ముఖ్యంగా భూములను ఆక్రమించుకోవాలి అంటే ఈ జంతువులను నిర్మూలించడమే ఒక భాగమని అందుకే ఆకలిని ఆయుధంగా చేసుకొని వారి భూభాగాలను ఆక్రమించుకునే వారట..
అమెరికన్లకు అడవి దున్నలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఏడాదికి లక్షల జంతువులను సైతం వేటాడే వారట.. అలా 1800 సంవత్సరంలో సుమారుగా 6 కోట్ల లోపు దున్నలను వేటాడడం ఒక ముప్పుగా మారిందట. చివరికి అమెరికాలో స్వచ్ఛమైన జాతి దున్నలు కేవలం 456 మాత్రమే ఉండేవట. వీటిని ఒక పార్కులో 250 ఉంచారని సమాచారం. అలాగే ఇవి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో రైల్వే నిర్మాణం చేపట్టడం కూడా ఇవి అంతరించడానికి ముఖ్య కారణమని అలాగే వీటి చర్మానికి కూడా భారీ డిమాండ్ ఏర్పడిందట.. రైఫిల్స్ వాడే వీటిని చంపడం , వేటాడు వీటిని చంపడం.. అలాగే సంపద పట్ల కోరిక భూమి స్వాధీనం చేసుకోవాలని కోరిక వంటివి పుట్టేవట..
అయితే ఈ అడవి దున్నేల పుర్రెల ఫోటోను సైతం మెషిన్ కార్బన్ వర్క్ అనే సంస్థ తీసినారట.. ఇది ఎక్కువగా ఎముకలను ప్రాసెస్ చేసే ఒక రిఫైనరి సమస్థ. అయితే ఈ అడవి దున్నల ఎముకల ను చక్కెర పరిశ్రమలో శుద్ధి చేయడానికి బొగ్గుగా ఉపయోగించే వారట. వీటి ఎముకలను గమ్ కోసం ఎరువుగా కూడా ఉపయోగించే వారట. ఇలా అమెరికా పశ్చిమ తీరంలో ఏర్పడిన వ్యర్ధాల నుంచి పుట్టిన ఒక విజయవంతమైన వ్యాపారానికి గుర్తుగానే ఈ ఫోటో చిహ్నం గా ఉన్నదట. అప్పట్లో ఆంగ్లేయుడు ఈ అడవి దున్నలను గేదెలుగా భావించి.. ఒక గేద చనిపోతే ఒక ఇండియన్ వెళ్ళిపోయినట్లుగా లెక్కలు వేసుకునే వారట... అయితే ఆరు కోట్ల జంతువులను వేటగాళ్లు చంపగలరా అనే ప్రశ్న కూడా అందరికీ తలెత్తిందట కానీ ఒక అధ్యయనంలో ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆ సమయంలో వచ్చిన ఆంత్రాక్స్, టెక్సాస్ టిక్ ఫీవర్ అనే రెండు వ్యాధుల వల్ల ఎన్ని జంతువులు మరణించాయని తెలియజేశారు.