ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జాబ్.. ఇక్కడ ఇరికినోడికి నరకమే?
నేటి రోజుల్లో పట్టణాలలో ఉండే ట్రాఫిక్ సమస్య అంతా ఇంత కాదు. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలు అందులో నుంచి బయటపడటానికి ఎన్ని గంటలు పడుతుందో కూడా ఊహించడం చాలా కష్టమే. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనంలోనే అటు ఆఫీస్ వెళ్లేందుకు ఇష్టపడుతూ ఇంకొంతమంది ఇలా వాహనాల్లో వెళ్తూ కనీసం ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించడం లేదు. తద్వారా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లో అయిపోతున్నాయి. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రోలాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన.. పూర్తిస్థాయిలో ఇది ట్రాఫిక్ కష్టాల నుంచి పడయలేక పోతుంది. అయితే ఇప్పటివరకు ట్రాఫిక్ జామ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అందరూ ఏదో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇలాంటి ట్రాఫిక్ జామ్ కాదు. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్. ప్రపంచంలోనే అతిపెద్దదా.. అని వినడానికే షాక్ అవుతున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
సాధారణంగా అయితే ఎవరైనా విఐపి వాహనాలు వచ్చినప్పుడు లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయిన లేదంటే రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్న సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరగడం చూస్తూ ఉంటాం. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది మాత్రం ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం. చైనాలోని బీజింగ్ లో ఆగస్టు 14 2010 లో బీజింగ్ - టిబేట్ ఎక్స్ప్రెస్ హైవే అయినా ఎన్హెచ్ 110 లో ఏర్పడింది. సుమారు 100 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఏకంగా 12 రోజుల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.