ఆంధ్రప్రదేశ్: చరిత్ర చెప్పని ఎన్నో రహస్యాలు ఆ భీమేశ్వరుడి గుడిలో..?

Divya
చరిత్రలో మనకి ఎన్నో తెలియని రహస్యాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని క్షేత్రాలలో తెలియని రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అలా తూర్పుగోదావరి జిల్లా పేరు వినగానే మొదట ఆహ్లాదకరమైన వాతావరణ గుర్తుకువస్తుంది.కానీ ఎంతో చరిత్ర కలిగినటువంటి ఇక్కడ భీమేశ్వరుడి ఆలయాలని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని అక్కడ భక్తుల నమ్మకం. ఈ గుడి సప్త గోదావరి తీరాన వెలిసింది.

కాశీలో నివసిస్తే మరణాంతరం మోక్షం లభిస్తుందో అలాగే భీమేశ్వరుడిని పూజించి కొన్ని క్షణాలు ఆయన సన్నిధిలో గడిపినట్లు అయితే వారికి సౌఖ్యం కైలాసం వంటివి రెండు లభిస్తాయట. తారకాసురుడు అనే అసురుడు శివలింగాన్ని సైతం ఆత్మలింగం చేసుకోవడం కోసం చాలా ఘోరమైన తపస్సుని చేశారట. అలా పరమేశ్వరుడు ప్రత్యేకమైన ఆత్మలింగాన్ని వరంగా అసురుడుకి అప్పగించారట. ఇలా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఐదు శివలింగాలలో అందులో ప్రతిష్టమైన ప్రాంతాలలో ఉన్నాయని మన పురాణాలు సైతం తెలియజేస్తున్నాయి.. ఆ లింగాని ఐదు ఖండాలుగా చేయడంతో .. అందులో చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాంతమే పంచరమాలని పురాణాలలో ఉన్నట్లుగా తెలుపుతున్నాయి.. క్షీరారామహేశ్వరుడిగా, అలాగే అమరావతిలో అమరేశ్వరుడిగా, అలాగే తామరకోట్లలో కుమారారామ మూర్తిగా.. అలాగే భీమవరం, ద్రాక్ష రామ క్షేత్రాలలో భీమేశ్వరుడి పూజలు సైతం అందుకొంటూ ఉంటాయట.

ఈ భీమేశ్వర ఆలయంలో నాలుగు వైపుల నాలుగు ఎత్తులైన గోపురాలు ఉంటాయట .అలాగే 12 ఎకరాలకు పైబడిన ఈ గుడి విస్తీర్ణం ఉన్నదట. అలాగే ఇందులో 70 అడుగుల కలిగిన ధ్వజస్తంభం ఉన్నదట. ఇది ఎత్తైన రాతి గోడల పైన నిర్మించబడిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి. అయితే ఈ భీమేశ్వరుని దర్శించుకోవాలి అంటే మొత్తం ఐదు ద్వారాలు దాటాల్సి ఉంటుందట. ముఖ్యంగా బయట నుంచి ఒక ప్రవారీ ఉంటుంది.. దాని తర్వాత మరొక ద్వారం ఉంటుంది ఈ రెండిటి మధ్య ప్రధాన ఆలయం రెండు అంతస్తులకు పైగా ఉంటుందట. రెండో ద్వారం నుంచి గర్భాలయంలోకి వెళ్లడానికి కొన్ని మెట్లు ఉంటాయట. అయితే ఈ గుడిలో వెళ్లిన తర్వాత ప్రదక్షిణాలు చేయడానికి అక్కడ చీకటి లోనే చేయవలసి ఉంటుందట.

అయితే పూర్వపు రోజుల్లో ఈ గోడల పైన రాతిబోడుపలు ఉండేవి అని ఇవే భక్తులకు వెలుగును అందించేవని అక్కడ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇదే అక్కడ లింగ రూపంలో ఉన్న భీమేశ్వరుడి భక్తులకు దర్శనం అన్నట్లుగా సమాచారం. ప్రధాన ఆలయం నుంచి తూర్పున అశ్వద్ధామ నారాయణ వృక్షం ఉంటుందట. ఇక్కడ సంతానం లేని వారు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ వృక్షానికి సైతం భక్తితో పూజిస్తే వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అక్కడ భక్తులు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడే సప్తర్షులు, అరుంధతి శిల్పాలు చిన్నచిన్న గుళ్ళల్లో కూడా దర్శనమిస్తాయట. అలాగే మెయిన్ ద్వారాకం దగ్గర చాలా మండపాలు ఉన్నాయట. అప్పట్లో ఎంతో మంది రాజులు, జమీందారులు భూములు, ధనం, ధాన్యం, డబ్బు రూపంలో విరాళాలు ఇచ్చేవారట. యాత్రికుల వసతి కోసం ఒక సత్రాన్ని కూడా ఏర్పాటు చేశారట. ప్రతిఏటా మాఘమాసంలో ఎనిమిది నుంచి పది రోజులపాటు అక్కడ పెళ్లిళ్లు జరుగుతాయట. చైత్ర పౌర్ణమి నాడు భీమేశ్వరునికి ప్రత్యేకమైన దవనంతో అర్పించి ఉయ్యాలలో ఊరేగిస్తూ పండుగల చేస్తారట. ఉగాది ముందు రోజు కొత్త అమావాస్యనాడు ప్రతిఏటా పండుగల చేస్తారట. శివుడే స్వయంభుగా ఇక్కడ భీమ లింగేశ్వర రూపంలో కొలువు తీరాలని అక్కడ భక్తుల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: