సూర్యుడిపై తుఫాన్ చూసారా.. షాకింగ్ వీడియో వైరల్?
సూర్యుడి నుంచి వెలువడే ఈ విస్ఫోటాలను సోలార్ ఫ్లేర్స్ అంటారు. ప్రజలకు అర్థం కావాలని వాటిని భూమిపై తుఫానులుగా పేర్కొంటారు. సోలార్ ఫ్లేర్స్ భూమిపై ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) సూర్యుడిని పరిశీలిస్తూ ఈ సారి సూర్యుడి నుంచి భారీ విస్ఫోటం జరిగింది. ఈ విస్ఫోటాలను సోలార్ ఫ్లేర్స్ అంటారు. ఈ ఫ్లేర్స్ వల్ల రేడియో కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, నావిగేషన్ సిస్టమ్‌లు దెబ్బతింటాయి. అంతేకాకుండా, అంతరిక్ష నౌకలు, అధిక ఎత్తులో ప్రయాణించే విమానాలు, అంతరిక్ష యాత్రికులకు ఇవి ప్రమాదకరం. ఈసారి జరిగిన విస్ఫోటాన్ని X2.3 తరగతి విస్ఫోటం అని వర్గీకరించారు. ఇందులో 'X' అంటే అత్యంత శక్తివంతమైన విస్ఫోటం అని అర్థం. '2.3' అనే సంఖ్య దాని తీవ్రతను తెలియజేస్తుంది.
సూర్యుడిపై తాజాగా జరిగిన భారీ విస్ఫోటం వల్ల భూమికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వే
సూర్యుడి నుంచి భారీ మొత్తంలో ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలు విడుదలయ్యే ప్రక్రియను కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) అంటారు. ఈ CME భూమిని చేరితే భూ అయస్కాంత తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆకాశంలో అద్భుతమైన కాంతి వలయాలు ఏర్పడతాయి. వీటినే ఆరోరాలు లేదా ఉత్తర దీప్తులు అంటారు. సూర్యుడిపై సంభవించే విస్ఫోటాలను నాలుగు తరగతులుగా విభజిస్తారు. X తరగతి విస్ఫోటాలు అత్యంత శక్తివంతమైనవి. M తరగతి విస్ఫోటాలు X తరగతి కంటే తక్కువ శక్తివంతమైనవి.