అవసరమా బ్రో.. కొండ అంచున స్టంట్ చేయబోయాడు.. చివరికి?
ఇలా ఈ మధ్యకాలంలో ఏకంగా ప్రమాదం అంచున నిలబడి ఎన్నో సాహసాలు చేసి గాయపడుతున్న వారు కొంతమంది అయితే.. ప్రాణాలు కోల్పోతున్న వారు ఇంకొంతమంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏకంగా స్టంట్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాంటి స్టంట్ చేయాలని అనుకున్నాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టి అతనికి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఏకంగా ఒక కొండ అంచును నిలబడి బ్యాక్ ఫ్లిప్ చేయాలని అనుకున్నాడు ఆ యువకుడు. అనుకున్నట్లుగానే బ్యాక్ ఫ్లిప్ చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి ఏకంగా కొండ కిందికి పడిపోయాడు. అయితే ఆ వ్యక్తి బ్రతికున్నాడా లేదంటే తీవ్రంగా గాయపడి చనిపోయాడా అనే విషయం మాత్రం తెలియలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. కుదురుగా ఉండకుండా ఇలాంటివి అవసరమా బ్రో అంటూ ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు.