బాబోయ్: అలాంటి భంగిమల్లో కూర్చోకూడదా...తెలిస్తే అసలు కూర్చోరుగా.?

FARMANULLA SHAIK
ఇళ్లు, ఆఫీసు ప్రదేశం ఏదైనా చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. కొద్ది మంది అలవాటు ప్రకారం వేసుకుంటే.. కొద్దిమంది స్టైల్ కోసం వేసుకుంటారు. అయితే ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..కాలు మీద కాలు వేసుకోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది తిమ్మిరి, నొప్పి, వాపు, ఇతర సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా, ఇది సిరల థ్రోంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.ఈ భంగిమ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2018లో జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జీర్ణ సమయం పెరుగుతుందని తద్వారా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని కనుగొన్నారు.

 దీనివల్ల అజీర్ణం, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు రావచ్చొని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియాటోంగ్ విశ్వవిద్యాలయం గాస్ట్రోఎంటరాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా జియాన్-పింగ్ లియు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో నే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కాళ్లలోని సిరలలో రక్త ప్రవాహం తగ్గుతుందని.. దీంతో సిరలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా దీర్ఘకాలికంగా ఒత్తిడి పెరగడం వల్ల సిరలు సాగిపోతాయని తద్వారా వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.ఇవేకాకుండా గర్భధారణ సమయంలో సమస్యలు,వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం,రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలున్నాయి.అయితే, చాలా కేసుల్లో ఇది కేవలం స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: