నిత్యం సోషల్ మీడియా లో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇందులో ఎక్కువగా కోతులు, సింహాలు, పాములకు వంటి సంబంధించిన వీడియోలు ఉంటాయి.ఈ సోషల్ మీడియా యుగంలో ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది.సాధారణంగా పాములు చేసే పనుల గురించి మనకందరికి తెలిసిన విషయమే.పాముల విషయానికి వస్తే వాటిని చూస్తేనే దాదాపు ప్రతి ఒక్కరు భయపడతారు.అందులో కింగ్ కోబ్రా నాగుపాము పేరు వింటేనే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ నేపథ్యంలో నేటి తరం తల్లిదండ్రుల్లో చాలా మందికి తమ పిల్లల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వారి ఫొటోలు, వీడియోలు, అల్లరి, అలకలు తదితర విషయాలకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తున్నారు.ఇందులో పెద్దగా తప్పుపట్టాల్సింది ఏమీ లేకపోయినప్పటికీ కొందరు హద్దులు మీరుతున్న తీరు మాత్రం జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇందుకు సంబంధించిన మరో ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.తాజా వీడియోలో ఓ బాలిక తన మెడలో పెద్ద భారీ పామును వేసుకుంది. అదో ఆట వస్తువు అన్నట్టు ఆటలాడింది.
ఒకానొక దశలో పాము ఆమె మెడకు చుట్టుకుంటున్నట్టుగా తిరగడంతో చిన్నారి కాస్త భయపడింది.
డాడీ.. డాడీ..అంటూ వెంటనే తండ్రిని పిలిచింది. భయపడొద్దంటూ వెనకాల నుంచి ఎవరో ధైర్యం చెప్పినట్టు కూడా వీడియోలో రికార్డైంది. వాస్తవానికి ఆమె బాలిక ఇప్పటికే ఇన్‌స్టాలో బాగా పాప్యులర్.బాలిక ప్రొఫైల్‌లో ప్రకారం, ఆమెకు పాములంటే చాలా ఇష్టమట. ''హాయ్.. నాపేరు ఆరియానా.. నాకు పాములంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఓపెద్ద పామును నా మెడలో వేసుకున్నాను. కంగారు పడకండి.. అంతా నా కంట్రోల్ లోనే ఉంది. ఇది నాకూ అలవాటే.. రోజూ చేసే పనే'' అంటూ ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు.అయితే, ఈ వీడియోపై జనాలు భగ్గుమన్నారు. వ్యూస్ కోసం పాప ప్రాణాలను రిస్క్‌లో పడేయడం కరెక్ట్ కాదని అన్నారు. చిన్నారిని ప్రైవసీని కాపాడకుండా ఇలా సోషల్ మీడియాలో పంచుకోవడంలో ఔచిత్యం ఏమిటని కొందరు ప్రశ్నించారు. వ్యూస్ కోసం తల్లిదండ్రుల్లోనూ ఇంత కక్కుర్తా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పామును చూసి పసిపాప భయపడుతున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం నిజంగా దారుణమని కొందరు తిట్టిపోశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఆరియానా గతంలోనూ ఇలాంటి పలు వీడియోలను పోస్టు చేసింది. పాములతో ఆడుకుంటూ ఆమె పోస్టు చేసిన చాలా సార్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.