హెల్త్: పురుషుల్లో లైంగిక సామర్ధ్యన్ని పెంచే దమ్మున్న పండ్లు.!

FARMANULLA SHAIK
డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. రోజూ గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే.. నీరసం, నిస్సత్తువ దరిచేరవు, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నట్స్‌లో విటమిన్ ఈ, కాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్‌ బి, నియాసిన్, థయామిన్, ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయి.అంజీర్ అత్యంత ప్రాచుర్యం పొందిన డ్రై ఫ్రూట్‌లలో ఒకటి.అంజీర పండ్లలో ముఖ్యంగా జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే జింక్ వంటి ప్రయోజనకరమైన పోషకాలు పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి నపుంసకత్వంతో బాధపడేవారు ఈ పండును ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఇందులో ఉండే జింక్ వంటి ప్రధాన పోషకాలు పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచుతాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ పండు పురుషులలో లైంగిక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట పాలతో అత్తి పండ్లను తినడం వల్ల పురుషుల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. అంజీర పండ్లను సలాడ్ రూపంలో తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండిన అంజీర పండ్లు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.అంజీర పండ్ల రుచి టేస్టీగా ఉంటుంది. ఈ పండ్లలో ఎన్నో రోగాలను దూరం చేసే ఔషదగుణాలుంటాయి. 

అందుకే అంజీరలను ఎక్కువగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. నిజానికి అంజీరలను చాలా మంది డ్రై గానే తినడానికి ఇష్టపడతారు. అంజీరలో కాల్షియం, ఇనుము, రకరకాల విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కార్భోహైడ్రేట్లు, కేలరీలు కూడా బాగానే ఉంటాయి. ఈ పండ్లను ఉదయం  పరిగడుపున తింటే ఆ రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. ఈ పండు శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. సోమరితనం దరిచేరకుండా చూస్తుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారికి అత్తిపండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అకాల స్ఖలనం, తక్కువ  స్పెర్మ్ వంటి లైంగిక సమస్యలు తొలగిపోతాయి. ఇదిలావుండగా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అత్తిపండ్లను పాలలో నానబెట్టి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. గ్లాస్ పాలు తీసుకుని ఎండిన అత్తిపండ్లను వేయండి. పొద్దున ఈ నానిన అంజీరలను తిని పాలను తాగండి. ఇలా తాగడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. అంజీరలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నొప్పి, మలబద్దకం, అజీర్థి సమస్యల నుంచి బయటపడేస్తుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారికి అంజీరలు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు పాలను తీసుకుని అందులో అత్తిపండ్లను నానబెట్టి ఉదయం తీసుకోండి. ఇది మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీరు సెక్స్ లో చురుగ్గా పాల్గొనేలా చేస్తుంది. మీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. లైంగిక కోరికలను పెంచుతుంది. పురుషులకే కాదు ఆడవాళ్ల సెక్స్ లైఫ్ పై అత్తిపండ్లు ప్రభావాన్ని చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: