వైరల్: మౌంట్ ఎవరెస్ట్ శిఖరం.. ప్రతి ఏడాది అంత పెరుగుతోందా..?

Divya
ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వత శిఖరం ఏమిటంటే అది మౌంట్ ఎవరెస్ట్.. అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతూనే ఉందంటూ ఇటీవల సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కొన్ని కోట్ల సంవత్సరాలుగా పెరుగుతూనే ఉందంటూ తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా కూడా 2MM ఎత్తు పెరుగుతోందంటూ ఇటీవలే శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎవరెస్ట్ శిఖరం ఎత్తు..8,848.6 మీటర్లు.. అయితే సముద్రనికి ఎవరెస్టు శివారానికి మధ్య 8.85 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుందట.


గతంలో పోలిస్తే ఈ మౌంట్ ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతున్నదని అందుకు కారణం ఏంటనే విషయాన్ని ఇటీవలే యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు తెలియజేశారు.. ఇలా మౌంట్ ఎవరెస్ట్ పెరగడానికి ముఖ్య కారణం భూమిలో జరిగేటువంటి నిరంతర మార్పుల వల్లే ఇది చోటు చేసుకుంటుంది అంటూ తెలుపుతున్నారు. ముఖ్యంగా మౌంట్ ఎవరెస్ట్ శిఖర వ్యక్తి పెరగడానికి ప్రధాన కారణం ఒక నది అని తెలియజేస్తున్నారు. ఆ నది వల్లే ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతోందని తెలియజేస్తున్నారు.. 15 నుంచి 50 మీటర్ల వరకు ఈ శిఖరం ఎత్తు పెరిగిందని పరిశోధకులు తెలియజేశారు.

అంతేకాకుండా ఎవరెస్టు శిఖరం వల్ల.. భూమి పైన ఉండేటువంటి రాక్ సాయిల్ కొట్టుకపోయి దీనివల్ల ఒత్తిడి తగ్గి ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతుందంటూ తెలియజేశారు సైంటిస్టులు.. ఈ ఒక్క ఎవరెస్టు శిఖరమే కాదు దాని పక్కన ఉన్న ఇతర పర్వత శిఖరాలు కూడా పెరుగుతున్నాయంటూ వెల్లడించారు. ఇది జియోలాజికల్ మార్పు అంటూ తెలియజేశారు. సుదీర్ఘకాలంగా భూమి లోపల జరుగుతున్న కొన్ని మార్పులు కారణంగానే ఈ పర్వత శ్రేణులు ఎత్తు పెరుగుతోందంటూ లండన్ పరిశోధకులు వివరించారు. నది పరివాహక ప్రాంతాలలో భూమి కోతకు గురి అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గడం వల్ల ఎవరెస్టు శిఖరం ఏడాదికి 2 మిల్లీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతోందంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: