బుల్లి లడ్డు.. ధర చూస్తే గుండె గుభేల్.. 2 తెలుగు రాష్ట్రాలలో ఇదే హైయెస్ట్..!

Divya
ప్రతి సంవత్సరం వినాయకుడి లడ్డుకి భారీ ధర లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాదులో ఏడాది గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భక్తులు లక్షలు వెచ్చించి మరీ గణేశుడు లడ్డుని సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో బొజ్జ గణపయ్య బుజ్జి లడ్డు ధర రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధర పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఎక్కడైనా సరే గణేశుడి లడ్డూ వేలంపాట అంటే అందరికీ బాలాపూర్ వినాయకుడే గుర్తుకొస్తాడు. రెండు రాష్ట్రాలలోనే అక్కడి లడ్డుకి రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. బాలాపూర్ కంటే ఎక్కువ ధర పలికే వినాయక లడ్డూలు కూడా ఉన్నాయని తాజాగా తేలిన లెక్కలు గుర్తుచేస్తున్నాయి.
బాలాపూర్ కంటే ఎక్కువ ధర హైదరాబాద్ బండ్లగూడ జాకీర్ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశుడి లడ్డు రికార్డు స్థాయిలో ధర పలికింది. గత ఏడాది రూ.1.26 కోట్లు ధర పలకగా ఈసారి బండ్లగూడ జాగిర్ గణేష్ లడ్డు వేలంపాట రికార్డు సృష్టించింది. కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో ఏడాది నిర్వహించిన వేలం పాటలో వినాయకుడి లడ్డు ఏకంగా రూ.1.87 కోట్లు పలికి రికార్డు సృష్టించింది గత ఏడాది కంటే దాదాపు రూ.60 లక్షలు అధికంగా ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఏడాది అత్యధికంగా రూ.1.87 కోట్లకు దక్కించుకోవడంతో గత ఏడాది రికార్డు బ్రేక్ అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరోవైపు మాదాపూర్ మై హోమ్ భుజా గణేశుడి లడ్డు కూడా భారీ ధర పలికింది. మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ప్రతిష్టించిన గణేశుడు లడ్డుకి వేలం పాట నిర్వహించగా ఆ లడ్డు దాదాపు రూ .29 లక్షలు పలికింది.  ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ అనే వ్యక్తి ఈ ధరకు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని రిచ్మండ్ విల్లాస్ గణేషుడి లడ్డు బ్రేక్ చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: