వైరల్: ట్రాక్టర్ చక్రం పైకి లేపదామనుకొని ఏకంగా పైకి పోయాడు?

Suma Kallamadi
కుర్రకారు పిచ్చి ఈ మధ్య పెచ్చుమీరిపోతోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది అర్రులు చాస్తున్నారు. ఈ క్రమంలో యువత ప్రమాదకర సాహసాలకు దిగి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. తత్ఫలితంగా కన్నవారికి విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఇలా ఎంతో మంది ఇలా తీవ్ర గాయాల పాలైన ఘటనలు మనం చూసాము. మరికొందరైతే ప్రాణాలు విడిచిన ఘటనలు గురించి కూడా మనం చదివాము. అయినా కూడా ఎవరూ లెక్క చేయకుండా వారి దారి వరిదన్నట్టు, సాహసాలకు ఒడిగడుతూ వ్యూస్, లైక్స్ పరమావధిగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రీల్స్ కోసం వీడియో చేయబోయి తన రెండు కాళ్లు పూర్తిగా విరగొట్టుకున్నాడు. దాంతో ఆ వీడియో కాస్త ఇపుడు వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్లో ఈ వీడియో షేర్ కాగా చాలామంది ఆ విడియోపైన విరుచుకు పడుతున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువకుడు ట్రాక్టర్‌కు ఉండే భారీ చక్రాన్ని తన రెండు కాళ్లతో పైకి లేపడానికి విశ్వ ప్రయత్నం చేసాడు. కింద సీట్లో జారబడి కూర్చుని 2 కాళ్లను ట్రాక్టర్ చక్రంపై పెట్టి దానిని పైకి లేపగా అంత బరువును ఆ కాళ్లు మోయలేకపోయాయి. దాంతో రెండు కాళ్లు కటిక పుల్లల్లాగా విరిగిపోయాయి. కళ్ల ముందే అంత భారీ ప్రమాదం జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాంతో ఈ వైరల్ వీడియోని జనాలు తెగ తిలకిస్తున్నారు. ఎంతలా అంటే, ఒక్క రోజులో సుమారు 2 కోట్ల పైగా వ్యూస్ ని సదరు వీడియో సొంతం చేసుకుంది. అంతేకాకుండా 3.75 లక్షల మందికి పైగా ఈ వీడియోపైన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ క్రమంలో కొందరు దీనినే మావైపు పిచ్చి అంటారు అని కామెంట్ పెడితే, మరొకరు నీ జీవితంతో నీవే ఎందుకు ఆడుకుంటున్నావు? అని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. మరెందుకాలస్యం, మీరు కూడా చూసి మీ స్పందనే ఏమిటో తెలియజేయండి!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: