ఓరి నాయనో.. పామునే కాటేసిన మనిషి?
మరి ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో ఎంత వైరల్ గా మారి పోతూ ఉంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. సాధారణం గా పాములు అంటే అందరికీ భయమే. అందుకే డైరెక్ట్ గా పాములను చూడడానికి తెగ భయపడి పోతూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పాములకు సంబంధించిన వీడియోలు చూడడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాములు ఎలా దాడి చేస్తాయ్. కాటు వేసే ముందు ఎలా ప్రవర్తిస్తాయి అన్న విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఎన్నో ఘటనల్లో పాములు మనుషులను కాటు వేయడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
కానీ ఒక మనిషి పాములు కాటు వేయడం ఎప్పుడైనా చూసారా.. ఊరుకోండి బాసూ.. మనిషి ఏమైనా విష పూరితమైన జీవ కాటు వేయడానికి.. అలా కాటు వేస్తే పాము ఊరుకుంటుందా అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన జరిగింది. ఒక వ్యక్తి చేతిలో పాము పట్టుకోగా.. అది అతన్ని కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలోనే ఆ యువకుడే పామును కాటు వేస్తాడు. దీంతో నొప్పితో ఆ పాము అల్లాడిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా.. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.