ఈ వినాయక అన్నసమారాధ తెలుగు ప్రజలకే ఆదర్శం..
- 25 రకాల ఐటెంలతో 4 వేల మందికి అఖండ అన్నసమారాధన
- కమిటీ సభ్యులే వంటమేస్త్రీలు , కేటరింగ్
- అచ్చ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించిన ఉత్సవాలు
వినాయకచవితి సందర్భంగా ఏలూరు జిల్లా కామవరపుకోట - కొత్తూరు గంగానమ్మ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన అఖండ అన్నసమారాధన ఎంతో ఆదర్శంగా నిలిచింది. ఏకంగా 25 రకాల ఐటెంలతో 4 వేల మందికి ఈ భారీ అన్నసమారాధన నిర్వహించారు. పైగా బంతి భోజనంలో 4 వేల మందికి మాటలు కాదు. ఈ అన్నసమారాధన ఎందుకు అందరికి ఆదర్శం అంటే... గంగానమ్మ కమిటీ సభ్యులు.. వారి కుటుంబ సభ్యులే ఆ రోజు ఉదయం నుంచి కూరగాయలు తరగడంతో మొదలు పెట్టి.. వంటలు చేయడం... వారే స్వయంగా వడ్డించడం అన్నీ చేశారు. అందరు కలిసికట్టుగా ఒకే కుటుంబం అన్న భావనతో చేసిన ఈ అన్నసమారాధన చక్కటి సంస్కృతి, సంప్రదయాలతో పలువురికి ఆదర్శంగా నిలిచింది.
బంతి భోజనం లో ఏడెనిమిది రకాల స్వీట్ .. హాట్ ఐటెం లతో పాటు తెలుగు సంస్కృతిలో భాగమైన పులిహోర అన్నం , బిరియాని తో పాటు ఉలవచారు - మజ్జిగ చారు - సాంబారు ఇలా రకరకాల ఫుడ్ ఐటెంలు అన్న సమారాధనలో స్పెషల్‌గా నిలిచాయి. గతేడాది కూడా ఇదే గంగానమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధన బాగా హైలెట్ అయ్యింది. ఈ అఖండ అన్న సమారాధనకు కామవరపుకోట, కొత్తూరు, పాతూరు నుంచే కాకుండా చుట్టు పక్కల ఐదారు గ్రామాలు అయిన ఉప్పలపాడు - రామన్నపాలెం - కొత్తూరు వారి గూడెం - ఆడమిల్లి - చిన్నమ్మారావు పాలెం - అల్లంచర్ల - గుంటుపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు కూడా తరలి వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి ఏర్పాట్లకు ముగ్ధులయ్యారు. ఏదేమైనా ఇక్కడ గంగానమ్మ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కలిసి కట్టుగా మన కుటంబం అన్న భావనతో చేసిన ఏర్పాట్లు .. అన్న సమారాధన లోకల్‌గా బాగా హైలెట్ అయ్యింది.. అందరికి ఆదర్శంగా నిలిచింది.