ఓరి నాయనో ఐస్‌క్రీమ్ పకోడీ అట.. ఎప్పుడైనా చూశారా..?

praveen
ఈ రోజుల్లో వంట మనుషులు చిత్ర విచిత్రమైన ఫుడ్ కాంబోలు తయారు చేస్తూ ప్రజలకు మతి పోగొడుతున్నారు. ఐస్ క్రీమ్ దోశ, చాక్లెట్ దోశ, చాక్లెట్ ఆమ్లెట్, గులాబ్ జామున్ దహీ, టమాట ఐస్ క్రీమ్, మ్యాంగో పానీ పూరి ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో విచిత్రమైన ఫుడ్ కాంబోలో మన దృష్టికి వచ్చాయి. ఇప్పుడు 'ఐస్ క్రీం పకోడీ రెసిపీ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఇది ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది! సాధారణంగా ఐస్ క్రీమ్ వేడివేడి నూనెలో వేస్తే ఏమవుతుందో వంట చేసే వారికి తెలిసే ఉంటుంది.

వైరల్ వీడియోలో ఒక యువకుడు చాకో బార్ ఐస్‌క్రీమ్‌లను తన చేతిలోకి తీసుకొని వాటిని శనగపిండి లోకి ముంచి ఆ తర్వాత వేడి వేడి నూనెలో డ్రాప్ చేయడం చూడవచ్చు. తర్వాత పకోడీ లాగా వాటిని గరిటతో తీయడం చూడవచ్చు  ఇవి ఫ్రైడ్ ఐస్ క్రీమ్‌లు కావని గమనించాలి. ఫ్రైడ్ ఐస్ క్రీం చాలా రుచిగా ఉంటుంది. ఇటీవల వైరల్ అయిన ఈ వీడియోలో, ఒక మనిషి చాలా సర్వసాధారణంగా ఐస్ క్రీములను తీసుకుని, వాటిపై బెసన్ పిండి రాసి, వేడి నూనెలో వేసి 'ఐస్ క్రీం పకోడాలు' చేస్తున్నాడు.  

ఆ వీడియోలో ఆ ఐస్ క్రీమ్‌లకు స్టిక్‌లు కూడా ఉన్నాయి. వేడి నూనెలో వేసినా అవి చిటపటలాడటం లేదు. సాధారణంగా నూనెలో ఒక్క నీటి చుక్క పడినా ఓ చిన్నపాటి విస్ఫోటనమే జరుగుతుంది. కానీ ఈ వీడియోలో అలా ఏమీ కనిపించలేదు. చివరకు ఇవి సాధారణ పకోడీ ల్లాగా తయారయ్యాయి. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది నిజంగా మాయాజాలం లాంటిది అని సోషల్ మీడియా యూసర్లు కామెంట్లు చేస్తున్నారు. వీరిని చూసి నిజంగానే ఐస్ క్రీమ్ తో పకోడీ చేయాలని ప్రయత్నిస్తే ప్రాణాలకే ప్రమాదం అని కొంతమంది హెచ్చరించారు.

ఆగస్ట్ 20న @desimojito యూజర్ Xలో ఈ వీడియో షేర్ చేయగా దీనికి 60 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. పదివేల దాకా లైట్స్ కూడా రావడం విశేషం. ఈ వీడియోను చూసేందుకు  https://x.com/desimojito/status/1825903903315206578?t=fY1rEYTpLXz9uZQc_dAFyg&s=19 లింక్ పై క్లిక్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: