వాషింగ్ మెషిన్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో వైరల్..

praveen
ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీనివల్ల అనేక కీటకాలతో పాటు విష సర్పాలు కూడా వెచ్చని ప్రదేశాలను వెతుకుతూ చివరికి ఇళ్లల్లోకి జొరబడుతున్నాయి. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి ఊహించని ప్రదేశాల్లో నక్కి ఉండవచ్చు. తాజాగా ఒక పాము అయితే ఏకంగా వాషింగ్ మెషీన్‌లో దూరింది వినడానికి ఏమీ నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని కోట అనే ప్రదేశంలో ఒక ఇంట్లో వాషింగ్ మెషీన్‌లో ఐదు అడుగుల పాము కనిపించింది. ఇంట్లో వాళ్ళందరూ ఈ సంఘటనతో చాలా భయపడిపోయారు. అయితే, ఆ పామును ఎవరో సురక్షితంగా బయటకు తీసి అడవిలో వదిలేశారు. ఈ విచిత్ర సంఘటన స్వామి వివేకానంద నగర్‌లో నివసించే శంభుదయల్ అనే వ్యక్తి తన బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ తెరిచినప్పుడు జరిగింది.

బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ తలుపు తెరిచాడు శంభుదయల్. అయితే అందులో దృశ్యం చూసి చాలా భయపడ్డాడు. లోపల ఒక కోబ్రా పాము కర్రలా చుట్టుకుని, తన పడగ పెద్దగా విప్పి దాడికి సిద్ధంగా ఉంది. పాము అకస్మాత్తుగా కదిలినందుకు భయపడిపోయిన శంభుదయల్ వెంటనే వాషింగ్ మెషీన్ ఆపి, వెనక్కి వెళ్లి నిలబడ్డాడు. ఆ పాము చాలా ప్రమాదకరం అని తెలుసుకున్న శంభుదయల్ వెంటనే ఆ ప్రాంతంలోని పాములను పట్టుకునే గోవింద్ శర్మ అనే వ్యక్తికి ఫోన్ చేశాడు.

గోవింద్ శర్మకు ఫోన్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాడు. ఆయన ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసి, అక్కడి నుంచి దూరంగా ఉన్న లాడ్పురా అడవిలో వదిలేశాడు. "ఆ పాము ఐదు అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంది. దాన్ని వాషింగ్ మెషీన్ నుంచి చాలా జాగ్రత్తగా బయటకు తీశాను. కోబ్రా పామును రక్షించిన తర్వాత, నేను దాన్ని నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న లాడ్పురా అడవిలో వదిలేశాను" అని శర్మ చెప్పాడు.

పాములు తమ ఆహారాన్ని వెతుకుతూ చాలా తరచుగా మనుషులు నివసించే ప్రాంతాలలోకి వస్తాయి, ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిలిచిపోయినప్పుడు తమ నివాసాల నుంచి బయటకు వచ్చేస్తాయి. "కోటలో ఇళ్ళల్లో, దుకాణాల్లో, ఆస్పత్రుల్లో కూడా పాములు కనిపించడం చాలా సాధారణం అయిపోయింది" అని శర్మ అన్నారు. కొన్ని రోజుల క్రితం, ఎంబీఎస్ ఆస్పత్రిలో కూడా ఒక కోబ్రా పాము కనిపించడంతో అక్కడ పని చేసే వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఈ లింకు https://x.com/IVibhorAggarwal/status/1826106126775304698?t=vNOVNacUph9M3pKzphqUeQ&s=19 పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: