హైవేపై పంచరైన ట్రక్.. చెక్ చేస్తే దిమ్మతిరిగే షాక్
కుప్పం బైపాస్ రోడ్‌లోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో కంటైనర్ వాహనం పంచర్ అయ్యింది. ఆ కంటైనర్‌ను చెక్ చేయగా అందులో తమిళనాడు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో పట్టుబడింది. పోలీసులు కంటైనర్ నుంచి 10 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. కంటైనర్ వద్దకు పోలీసులు చేరుకోగానే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పరార్ అయ్యారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తీసుకెళ్తూ ఉంటారు.
చిత్తూరు జిల్లా మీదుగానే ఈ స్మగ్లింగ్ సాగుతూ ఉంటుంది. రైస్ హబ్‌గా ఉన్న బంగారు పేటకు మూడు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మార్గాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అయినప్పటికీ స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. కిలో రేషన్ బియ్యం రూ.2ల కమిషన్‌తో ఈ వ్యవహారం సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే రైస్ స్మగ్లింగ్ ముఠాకు రాజకీయ నేతల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.