ఆలుగడ్డలు అడిగి అడ్డంగా బుక్ అయినా ఎస్ఐ..!

frame ఆలుగడ్డలు అడిగి అడ్డంగా బుక్ అయినా ఎస్ఐ..!

FARMANULLA SHAIK
ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌కు చెందిన ఓ ఎస్ఐ.. ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేస్తున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.సోషల్ మీడియాలో ఒక ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. సౌరిఖ్ పోలీసు స్టేషన్ పరిధిలోని భవల్‌పూర్ చపనున్న చౌకీలో ఎస్‌ఐగా పనిచేస్తున్న రాం కృపాల్ సింగ్ కేసును సెటిల్ చేసేందుకు ఒక రైతు నుంచి 5 కిలోల ఆలుగడ్డలు డిమాండ్ చేయడం ఆ ఆడియో క్లిప్‌లో వినిపించింది.అయితే అంత ఇవ్వ లేనని రైతు బతిమాలాడు. దీంతో రైతుపై ఎస్‌ఐ మండిపడ్డాడు. మొత్తానికి 3 కిలోలకు వీరి మధ్య ఫోన్‌లో అంగీకారం కుదిరింది. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్‌ఐ కృపాల్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్‌పి అమిత్ కుమార్ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు.అయితే ఆ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ లంచంగా కోరింది కేవలం ఆలుగడ్డలను కాదని, అది దేనికో సంకేత నామమని అనుమానిస్తున్న పోలీసులు దాని నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఆలుగడ్డలకు ఏదో కోడ్ భాష ఉందని, అదేమిటో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.అదేంటి ఆలుగడ్డలు కూడా కొనుక్కోడానికి ఎస్ఐ వద్ద డబ్బుల్లేవు అని అనుకుంటున్నారా? లేదా ఇలా కూడా ఎవరైనా లంచం తీసుకుంటారా? అనుకుంటున్నారా? అది కాదు.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అలుగడ్డలు అనే పదాన్ని లంచానికి కోడ్ వర్డ్‌గా ఉపయోగించాడు. వివరాల్లోకి వెళితే.. రామ్ కృపాల్ సింగ్ అనే పోలీస్ సారిఖ్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.ఓ కేసును పరిష్కరించేందుకు బాధితుడి నుంచి ఆయన లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అయిన రైతును ఎస్ఐ ‘5 కేజీల ఆలుగడ్డలు’ లంచంగా కావాలని కోరాడు. అయితే రైతు 2 కిలోలు మాత్రమే ఇచ్చాడు. దానికి ఎస్ఐ అంగీకరించలేదు. చివరికి 3 కిలోల ఆలుగడ్డలకు ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. డబ్బుల కోసం ఆలుగడ్డల్ని కోడ్ వర్డ్‌గా వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేసుపై శాఖపరమైన విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: