దేవాలయ హోర్డింగ్ పై మియా ఖలీఫా..ఆగ్రహాంతో నెటిజన్లు..!

frame దేవాలయ హోర్డింగ్ పై మియా ఖలీఫా..ఆగ్రహాంతో నెటిజన్లు..!

FARMANULLA SHAIK
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో మతపరమైన పండుగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ మియా ఖలీఫా చిత్రం కనిపించింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ వేడుకను కొద్ది రోజుల పాటు ప్రతి గ్రామంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు. అయితే కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లియమ్మన్ ఆలయాల వద్ద పండుగ దీపాలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయగా, వాటిలో దేవత ఫొటోలతో పాటు, మియా ఖలీఫా ఫొటో కూడా ఉంది.ఆమె, పండుగ సాంప్రదాయ నైవేద్యాలలో భాగమైన 'పాల్ కుడం' ని ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా ఉంది. అలాగే ఆ హోర్డింగ్‌లో దానిని ఏర్పాటు చేసిన వారి ఫొటోలను, వాటి క్రింద తమ పేర్లను కూడా ముద్రించుకున్నారు. దీనిని చూసిన పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోర్డింగ్‌కు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని తొలగించారు. అయితే అలా కావాలనే చేశారని పలువురు అంటుండగా మరికొందరు దానిని కాదని కొట్టిపడేస్తున్నారు.ఆది ఉత్సవ్ రోజున ప్రజలు నాడి కథవర్‌ను పూజించి వారి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లి అమ్మన్ ఆలయాల్లో వివిధ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ లైటింగ్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రజలను ఆహ్వానించారు. ప్రోగ్రామ్‌కి, మియా ఖలీఫా ఫోటోకు మధ్య ఎటువంటి సంబంధం లేదు. అందుకే ఈ ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆది ఉత్సవ్ లేదా సనాచ్య రోజున వర్షం, నదిని కృతజ్ఞతగా పూజిస్తారు. తమిళనాడులో దీనిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మా అమ్మన్ అంటే పార్వతి దేవి ఆలయాలలో ఈ పండుగ చాలా రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో దేవి మాతను పూజిస్తారు. భజనలు, కీర్తనలు పాడతారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ పండుగ తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలలో ముఖ్యమైన భాగంగా ఉంది.ఏదేమైనా ఒక పోర్న్ స్టార్ ఫోటోను దేవాలయ హోర్డింగ్ పై పెట్టడం అనేది క్షమించరాని తప్పని నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: