వైరల్: హిందువులారా మేల్కోవాలి..!

Divya
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే మాట మన తెలుగు సాంప్రదాయం నుంచి పుట్టింది.. మనం ఎవరి మీదనో కాదు ముందుగా మన బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. నీ సంప్రదాయాన్ని నువ్వు గౌరవించాలి.. నీ ఆలయాన్ని నువ్వు గౌరవించుకోవాలి. ఇతరుల సాంప్రదాయాలను నువ్వు విమర్శించడం దూషించడం పద్ధతి కాదు.. ముస్లిమ్స్ ఖచ్చితంగా తమ మసీదుకి వెళుతూ ఉన్నారు.. అందుకు అభినందించాలి. ముఖ్యంగా వారి వస్త్రధారణ మహిళలు వేసుకుని వస్త్రధారణ విషయంలో కూడా వారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. వారు కుటుంబ పెద్ద మాట వింటున్నారు.

మరొకటి ఏమిటంటే క్రిస్టియన్స్ వాళ్ల పండగ అప్పుడే కాదు ప్రతి ఆదివారం కూడా కచ్చితంగా ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. ఈ విషయానికి కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు గుడికి వెళ్లట్లేదు.. నీ కుటుంబాన్ని కూడా గుడికి తీసుకు వెళ్ళలేదు.. ఎప్పుడు అవకాశం ఉన్న చాలా మందికి గుడికి వెళ్లాలనే ఆలోచన రానేరాదు.. రానప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడకపోవడం మంచిది.. బేసిగ్గా నీ సంస్కృతిని నువ్వు కాపాడుకోకుండా.. వాళ్ల సంస్కృతి చెడిపోవాలని ఎందుకు కోరుకుంటావు..

ఒకప్పుడు హిందువులు కచ్చితంగా ఆలయాలకు వెళ్లేవారు.. ఇతర మతస్తులు వాళ్ళ దేవాలయాలకు చాలా తక్కువగా వెళ్లేవారు.. ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్లు ప్రతి చోటా కూడా తమ దేవుడిని సొంత ఊర్లలోనే పెట్టుకుంటున్నారు. నీకు కూడా ప్రతిచోట దేవాలయం ఉన్నప్పటికీ కూడా వెళ్లడానికి బద్దకంగా మారుతూ ఉన్నారు. దైవదర్శనం చేసుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే .. సాంప్రదాయ పద్ధతిని మీ ఇంట్లో ఉంచుకుంటే మరింత మంచిది. భోజనం సక్రమంగా తిను బాధ్యతగా ఉండు.. పెద్దలను గౌరవించాలి అన్నది కూడా మన సాంస్కృతి చెప్పింది.. పిల్లల కు సంబంధించి ఆలనా పాలన విషయాలను కూడా మన సంస్కృతి చెప్పింది.. ఇవన్నీటిని నువ్వు పాటించాలి.. ఇలాంటివి పాటించకుండా అవతలి వారిని దూషించడం తప్పే.. ప్రతి ఒక్క హిందువుకి ఈ విషయం తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: