తలపై రెండు గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని.. ఆ మహిళ ఏం చేస్తుందో చూడండి?

praveen
సాధారణంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు తమ టాలెంట్ ఏంటో తమకు తెలిసినప్పటికీ ఇక వాటిని ఎక్కడ ప్రదర్శించాలో తెలియక ఎంతో మంది సైలెంట్ గానే ఉండిపోయేవారు. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో మాత్రం ఆ అవసరమే లేకుండా పోయింది. ఇక తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎక్కడికో వెళ్లి ఎవరినో బ్రతిమిలాడటం కాదు. సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి పోస్ట్ పెడితే చాలు ఇక అందరికీ చేరిపోతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అయింది.

 దీంతో తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను తెగ వాడుకుంటున్నారు. దీంతో ఇక నేటి ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి వాటిలో కొన్ని కొన్ని వీడియోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి  ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో మహిళా శక్తిని చూసి నేటిజన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు   సాధారణంగా పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు బలం తక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు.

 అందుకే మహిళలు కనీసం ఒక గ్యాస్ సిలిండర్ ని కూడా ఎత్తలేరూ. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ రెండు గ్యాస్ సిలిండలను తలపై పెట్టుకుని డాన్స్ చేస్తూ కనిపించింది.  ఏకంగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్న ఆమె తలపై రెండు సిలిండర్లు దానిపైన ఒక బిందెను కూడా పెట్టుకుంది. అయితే తలపై ఇంత భారాన్ని మోస్తూ చిరునవ్వుతో ఆమె డాన్సులు చేస్తుంది. ఏకంగా తల పైన ఇంత భారం ఉన్నప్పటికీ కూడా ఆమె ముఖ కవళికలు, డాన్స్ స్టెప్స్ చూసి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఆమె మహిళా శక్తికి నిదర్శనం అంటూ ఎంతో మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: