కుక్క పిల్లను చుట్టేసిన పాము.. చివరికి ఏం జరిగిందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచ మంతా పాకి పోయిన నేపథ్యం లో  ఇంటర్నెట్ లో పాములకు సంబంధించిన వీడియోలు తరచు ఏదో ఒకటి ప్రత్యక్షమవుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇలాంటి వీడియోలను చూసేందుకు అటు ఇంటర్నెట్ జనాలు మొత్తం ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పాముల కదలికలు అవి ఎలా అటాక్ చేస్తాయి అన్న విషయాన్ని చూసి అవగాహన తెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఈ భూమ్మీద ఉండే ఎన్నో విషపూరితమైన పాములు ఏకంగా జంతువులు పక్షులపై కూడా ఎంతో వేగంగా దాడి చేసి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పాములు దాడి చేసే విధానం భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి తరహా వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే తెరమీదకి వచ్చింది. ఏకంగా ఒక కుక్క పిల్లపై పాము అటాక్ చేసింది కుక్కపిల్ల శరీరాన్ని మొత్తం చుట్టేసి చంపేయబోయింది

 అయితే ఇలా తన శరీరాన్ని చుట్టేసిన పాము నుంచి తప్పించుకునే కుక్కపిల్ల ఎంత ప్రయత్నించినా చివరికి ప్రయోజనం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలా పాము శరీరానికి మాత్రమే కాదు మెడను కూడా చుట్టేసి ఉపిరాడకుండా చేసింది. దీంతో కుక్కపిల్ల ఒక్కసారిగా అల్లాడిపోయింది. అయితే అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆ కుక్క పిల్ల వద్దకు వచ్చి పామును విడిపిస్తాడు. ఇక ఆ తర్వాత కుక్క పిల్ల ఊపిరి పీల్చుకుంటుంది. ఈ వీడియో చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే పాము అటాక్ చేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా సదరు వ్యక్తి కుక్కను కాపాడేందుకు చేసిన ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: