చూస్తేనే వణుకు పడుతుంది.. స్నేక్ క్యాచర్ ను పాము ఎలా కాటేసిందో చూడండి?

praveen
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలకు కొదవ లేకుండా పోయింది  ఇలా ఇంటర్నెట్ లోకి ఎన్ని వీడియోలు వచ్చిన అవి వైరల్ గా మారిపోతూనే ఉంటాయి. ఎందుకంటే పామును డైరెక్ట్ గా చూడటానికి ఎంతగానో భయపడిపోయే జనాలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే వీడియోలను చూడడానికి మాత్రం తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు  పాము కదలికలు ఎలా ఉన్నాయి. అవి ఎలా మనుషులపై అటాక్ చేస్తాయి అన్న విషయాలను వీడియోలో చూసి తెలుసుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు ఎంతోమంది మనుషులకు పాములు కదలికలపై ఒక అవగాహన వచ్చేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఈ మధ్యకాలంలో అయితే ఎంతోమంది స్నేక్ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా విషపూరితమైన పాములను సైతం పట్టుకుని ఇక అడవుల్లో వదిలేయడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇలా స్నేక్ క్యాచర్ లు పాములను పట్టుకోవడానికి సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక కొన్నిసార్లు స్నేక్ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుంటే మరికొన్నిసార్లు మాత్రం ఏకంగా పాముకాటుకు గురవుతూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియోలో కూడా ఇలాంటిదే జరిగింది.

 పాము కు సంబంధించిన ఒక వీడియో చూసి ఇంటర్నెట్ జనాలు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతున్నారు. ఓ ప్రాంతంలో పాము సంచరిస్తుంది అని తెలుసుకున్న ఒక స్నేక్ క్యాచర్ దానిని పట్టుకునేందుకు అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే గడ్డిలో ఉన్న ఆ పామును వెతికి మరీ దానిని పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఆ పాము తోక పట్టుకున్నాడు  ఎంతో చురుకుగా ఉన్న ఆ పాము ఉన్నట్టుండి ఏకంగా అతను చేతి మీద కాటు వేస్తుంది. గట్టిగా పదునైన కోరలతో పట్టుకుంటుంది  అయితే కాసేపు నొప్పితో విలవిలలాడిన స్నేక్ క్యాచర్.. భయపడకుండా దాన్ని పట్టు నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే అతని చేతికి గాయమై రక్తం కూడా కారుతుంది. కానీ ఆ పాము విషపూరితమైనది  కాకపోవడంతో ఇక అతనికి ఏమీ కాలేదు.

https://www.instagram.com/reel/CyQPVqzs9L5/?igsh=cjdlOHFtZjIwMWdu


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: