ఇదెక్కడి ప్రమోషన్ గురూ..రోడ్డు మీద దొరికిన రూ. వంద నోటు.. కానీ?

praveen
ఇటీవల కాలంలో ఎన్నో కంపెనీలు పబ్లిసిటీ కోసం ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కంపెనీలు అయితే సెలబ్రిటీలతో వాణిజ్య ప్రకటనలు చేయించుకుని ఇక తమ బ్రాండ్ ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉన్నాయి. దీనికోసం ఏకంగా కోట్ల రూపాయల పారితోషకం ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఇంకొన్ని కంపెనీలు ఇక భారీ హోర్డింగులను  ఏర్పాటు చేయడం ద్వారా ప్రచారాన్ని చేయడం చూస్తూ ఉన్నాం.

 ఇలా ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని చిన్నచిన్న సంస్థలు పాంప్లేట్స్ రూపొందించి ఇక రోడ్లపై పంచడం ద్వారా పబ్లిసిటీ చేయడం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పాంప్లెట్స్ పంచితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కనీసం చూడ కూడా చూడరు. పాంప్లెట్లు పంచే వారిని హీనంగా చూసి అక్కడ నుంచి వెళ్లిపోవడం కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మధ్య ఇటీవలే ఒక కెఫే యాజమాన్యం పబ్లిసిటీ కోసం ఒక వినూత్నమైన ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఆ కెఫే క్రియేటివిటీ చూసి ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 సాధారణంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు  ఇక ఒక వంద రూపాయల నోటు పడి ఉంది అంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్లి ఆ వంద రూపాయల నోటు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి రోడ్డు మీద వంద రూపాయల నోటు పడి ఉండడంతో దాని దగ్గరికి వెళ్లి తీసుకున్నాడు. కానీ ఆ వంద నోటును పూర్తిగా విప్పి చూసి ఒకసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఒకవైపు ₹100 నోటు ముద్రించి ఉండగా.. మరోవైపు కెఫేకు సంబంధించిన వివరాలు అక్కడ దొరికే ఫుడ్స్ వివరాలు రాసి ఉన్న యాడ్ ఉంది. దీంతో ఇది చూసి ఒకసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో నేటిజన్స్ ఇక ఆ కెఫే యాజమాన్యం క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: