వైరల్:ప్రజలను వణుకు పుట్టిస్తున్న గవదబిళ్లల కేసులు.. లక్షణాలు.. నివారణ ఇవే..!!

Divya
కేరళలో గవద బిల్లలు కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయట. ఏకంగా ఒక్కరోజులోనే 200 కేసులు సైతం నమోదైనట్టుగా అక్కడ ఆరోగ్యం మంత్రి శాఖ వెల్లడించారు.. గత నెలలో దాదాపుగా 2500 కేసులు కూడా ఇవి నమోదు అయ్యాయని వైద్య అధికారులు గుర్తించారు.. ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ తో సహా వివిధ ప్రాంతాలలోని పిల్లలు సైతం ఈ గవద బిల్లల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు. దీంతో చాలామంది ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలోని అసలు ఈ గవదబిల్లలు ఎందుకు వస్తాయి నివారణ ఏంటి అనే విషయం పైన అక్కడ అధికారులు వివరణ ఇస్తున్నారు.

ఈ గవద బిల్లలు ముఖ్యంగా పిల్లలు యువకుల పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుందట వైరల్ ఇన్ఫెక్షన్ ఇది రుబ్బుల వైరస్ కుటుంబానికి చెందినటువంటి ఒక వైరస్ అట. ఈ వైరస్ మానవులకు మాత్రమే సోకుతుందని ఇది బాధితులు నోటి నుంచి వచ్చే తుంపర్ వల్ల కూడా సంక్రమిస్తుందట.. ముఖ్యంగా దగ్గు జలుబు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందని ఈ వ్యాధి కారణంగా చెవుల చుట్టూ ఉన్న రెండు ప్రాంతాలలో వాపుతో కూడిన జ్వరం కూడా వస్తుందని వెల్లడిస్తున్నారు.

సాధారణంగా గవద బిల్లలు దానంతట అవే వెళ్ళిపోతాయి కొన్నిసార్లు యువకులలో దీని ప్రభావం ఎక్కువగా అయితే చెవుడు లేదా ఆర్కిటిక్ వంటి సమస్యలు కూడా వస్తాయట.. గవద బిల్లలకు చికిత్స లేదు.. కానీ కోల్డ్ కంప్రెస్ చేయడం సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వంటివి చేయడం వల్ల కాస్త ఉపశమనాన్ని పొందుతారు. ఒకవేళ గర్భిణీ స్త్రీలకు వచ్చినట్లు అయితే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. ఇలాంటి గవదబిళ్లల కేసులు రాకుండా ఆయా ప్రభుత్వాలు కూడా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.. ప్రజలను కూడా అప్రమత్వంగా ఉండేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: