వైరల్: నేడే మౌని అమావాస్య.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..?

Divya
సనాతన ధర్మంలో మౌని అమావాస్య కు చాలా విశిష్టత ఉన్నది..ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన అంటే ఈ రోజునే మౌని అమావాస్య ను ప్రజలు జరుపుకుంటున్నారు. మాఘ మాసంలో వచ్చే అమావాస్యమే మౌని అమావాస్యగా పిలుస్తారు. దీంతో పాటుగా గంగానది నీరు మౌని అమావాస్య రోజున అమృతంగా మారుతుందని మన పురాణాలు సైతం తెలియజేస్తున్నాయి. ఎంతో పవిత్రమైన మౌని అమావాస్యకు సంబంధించి పలు నియమాలు ఉన్నాయి.. ప్రతిసారి వచ్చే అమావాస్యల తో పోలిస్తే మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.

మౌని అమావాస్య తిధి ఈ రోజున ఉదయం 8:2 నిమిషాలకు ప్రారంభమై రేపటి రోజున 4:20 నిమిషాలకు వెళ్ళిపోతుంది మౌని అమావాస్య రోజున ఎవరైనా నిర్దిష్టంగా నది స్నానం చేసి శ్రీమహా విష్ణువుని పూజిస్తే మంచి జరుగుతుంది. అలాగే పలు రకాల దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలను కూడా అందుకోవచ్చు. మౌని అమావాస్య రోజున పొరపాటు కూడా కొన్ని కూరలను వండుకొని తినకూడదని పలువురు పండితులు తెలియజేస్తున్నారు. వాటిని తినడం వల్ల ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అంటూ తెలుపుతున్నారు.

మౌని అమావాస్య రోజున ఎవరు మాంసం ముట్టకూడదు మాంసం వండి తింటే కచ్చితంగా ఆ ఇంటికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి మౌని అమావాస్య రోజు పాలు పెరుగు కూడా తీసుకోకూడదు ఒకవేళ వీటిని తీసుకోవాల్సి వస్తే ఇందులోకి కాస్త బెల్లం కాని పసుపు కాని వేసుకొని తీసుకోవడం ఉత్తమం. ఆకుకూరలు వండేటప్పుడు కూడా పలు విషయాలను గుర్తించుకోవాలి..ఇందులో ముల్లంగి, పొట్లకాయ, దోసకాయ వంటి కాయగూరలను ఈ రోజున వండుకోకూడదు. ఇవి కాకుండా మిగిలిన అన్ని రకాల కాయగూరలను సైతం ఉపయోగించుకోవచ్చు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుందని నమ్మకం మాంసాహారం తింటే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని పండితులు సైతం తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: