Viral: రూ.500 నోట్ల పై ఇకనుంచి శ్రీరాముడి చిత్రం..!!

Divya
బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ అయినటువంటి RBI సమస్థ జనవరి 22వ తేదీన శ్రీరాముడి చిత్రాలతో కూడినటువంటి రూ .500 రూపాయల నోటును సైతం విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం శ్రీరాముడి చిత్రాలతో కూడినటువంటి రూ.500 నోట్ ని సైతం ఆర్బిఐ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో కుంకుమార్చన జరుగుతున్న సమయంలోనే ఈ రూ .500 నోట్లను సైతం విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు RBI గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

అయితే అయోధ్యలోని శ్రీరాముడు శ్రీరామ మందిరం తో ఉన్నటువంటి  రూ.500 రూపాయల నోట్ తో కూడిన ఒక నోటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ప్రస్తుతమైతే రూ .500 నోట్ పైన మహాత్మా గాంధీ చిత్రం ఉండగా ఇప్పుడు శ్రీరాముడి ఫోటో ఉన్నటువంటి ఒక నోటు వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా ఎర్రకోట ఫోటో ఉన్నచోట అయోధ్య రామ మందిరం నిర్మిస్తూ ఉన్నటువంటి ఫోటో ఇందులో కనిపిస్తోంది. ఒకవైపు ఈ నోటు వైరల్ గా అవుతున్నప్పటికీ..RBI మాత్రం ఈ కొత్త సిరీస్ రూ .500 నోటు గురించి ఏ విధంగా సమాచారాన్ని ఇవ్వలేదు.

అయితే ఈ శ్రీరాముడు చిత్రాలతో ఉన్నటువంటి రూ.500 రూపాయల నోటు నకిలీ దా కాదా అనే విషయం పైన బ్యాంకింగ్ రంగ నిపుణుడు ఆయన వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వని రానా మాట్లాడడం జరిగింది.. అయితే వైరల్ గా మారుతున్న ఈ రూ.500 రూపాయల నోటుకు RBI నుంచి ఎటువంటి సమాచారం లేదని ఒకవేళ ఇది ఫేక్ న్యూస్ అంటూ కూడా తెలియజేశారు.. మరి దీనిపైన ఆర్బిఐ కొత్తగా రూ .500 రూపాయల నోటు లను విడుదల చేయలేదన్నట్లుగా తెలుస్తోంది. మరి పూర్తిగా తెలియాలి అంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: