వైరల్:మీరు ఎప్పుడైనా బిస్కెట్ల బజ్జీలను చూశారా.. వీడియో వీడియో వైరల్..!!

Divya
చాలామందికి కొత్త కొత్త వంటకాలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వ్యాపారాలు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో కొత్త కొత్త వెరైటీలను చేస్తూ జనాలకు రుచి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాటి గురించి నిత్యం ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తూ ఉంటారు.. అందులో కొన్ని వంటకాలు కొంతమంది జనాలను మెప్పిస్తే.. మరికొన్ని మాత్రం కోపాన్ని తెప్పించేలా కనిపిస్తున్నాయి..

తాజాగా సోషల్ మీడియాలో ఒక  వెరైటీ డిష్ వీడియో వైరల్ గా మారుతోంది .. అదేమిటంటే మనం మామూలుగా కొత్తిమీర బజ్జి, పకోడీలు చేయడం  వంటివి మనం చూస్తూనే ఉన్నాము.. కానీ ఇప్పుడు తాజాగా ఓరియో బిస్కెట్లతో బజ్జీలను చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇది ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.బజ్జీలలో రకరకాల వెరైటీలు ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు బజ్జీల ప్రియులు స్పైసీగా చేసుకునే వంటకం అంతేకాకుండా తక్కువ ధర కావటంతో సాయంత్రం అయితే చాలు ఎక్కువమంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు.

ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో టిఫిన్ సెంటర్లో వ్యక్తి బజ్జీల పిండిని సిద్ధం చేసుకొని  అందులో బిస్కెట్లను ఆ పిండిలో అద్ది నూనెలో బజ్జీలుగా వేశారు.. అంతే వాటిని సగానికి కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే ఉన్నట్లుగా చూపించారు అయితే వీటి  రుచి ఎలా ఉందో తెలియదు కానీ.. చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు ఈ వింత వంటకానికి సంబంధించిన ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.. దీంతో క్షణాలలో లైకులు తో ఈ వీడియో ట్రెండీగా మారుతుంది మరి కొంతమంది ఈ ప్రయోగాన్ని చూసి నేటిజన్స్ సైతం ఇదేమి ఆహారం అంటూ కూడా వారి పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వెరైటీ వంటకాలతో జనాలను పిచ్చెక్కించేలా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: