వైరల్:బీర్లు బిర్యానీతో ఏడవ తరగతి పిల్లలు హల్ చల్..!!

Divya
నేటి బాలలే రేపటి పౌరులు అని మన పెద్దవాళ్లు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు.. అయితే ఇప్పట్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా మందు సిగరెట్టుకు బానిసలు అవుతున్నారు.. దేశంలో రోజు రోజుకు విష సంస్కృతి మరింత ఎక్కువగా మారుతోంది. చదువు బాట పట్టాల్సిన పిల్లలే చెడు వ్యసనాలకు సైతం ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు.సోషల్ మీడియాలో ఓక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ఆ వీడియోలో ఏముంది అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం.
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు మధ్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ వీడియోలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫుల్ గా మద్యం సేవించి ఊగుతూ తూగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇంతకు అది ఎక్కడంటే ఆంధ్రాలో అనకాపల్లి జిల్లా చోడవరం లో బాలుర వసతిలో  7వ తరగతి విద్యార్థులు న్యూ ఇయర్ పార్టీనీ ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
న్యూ ఇయర్ కి కేకులు బూందీలు, మిక్సర్ కూల్ డ్రింక్ వంటివి తాగితే ఎలాంటి క్లిక్ వస్తుందనుకున్నారేమో.. ఈ చిన్న పిల్లలు బీర్లు మందు సీసాలను తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటని అడిగితే నువ్వు ఈ వీడియో కట్ చెయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే వీడియో తీస్తున్న అతను ఎంత చెప్పిన వీడియోని ఆపకపోవడంతో ఆ పిల్లలు అందరూ  కలిసి దాడి కూడా చేశారట. మరి హాస్టల్లో ఇంత దతంగా జరుగుతుంటే హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నారని సందేహాలు అధికారులకు తలెత్తుతున్నాయి.. దీంతో వీద్యాధికారుల సైతం ఈ ఘటన పైన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే ఆసరాగా తీసుకొని కొంతమంది టిడిపి నాయకులు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: