పిల్లిని ఎత్తుకెళ్లాలని వచ్చిన డేగ.. అంతలో ఊహించని షాక్?

praveen
ఈ భూమి మీద అత్యంత వేగంతో వేటాడే జంతువు ఏది అంటే చిరుత పులి అని చెబుతూ ఉంటారు అందరూ. అయితే గాల్లో ఎగురుతూ అత్యంత వేగంగా వేటాడే పక్షి డేగ అని చెప్పాలి. ఏకంగా కిలోమీటర్ల ఎత్తులో గాల్లో ఎగురుతున్న భూమ్మీద ఉండే చిన్న చిన్న జంతువులను సైతం ఎంతో తీక్షనగా చూస్తూ ఇక వేగంగా వచ్చి నోటితో కరుచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది డేగ. ఒకసారి డేగ కన్ను పడింది అంటే ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ఏకంగా భూమ్మీద ఉండే చిన్న చిన్న జీవులను మాత్రమే కాదు నీటిలో ఉండే చేపలను సైతం అత్యంత వేగంగా వేటాడగలదు.

 అయితే డేగలు ఎంత వేగంగా వేటాడగలవు అన్నదానికి సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎంత వేగం ఉన్న కొన్ని కొన్ని సార్లు వాటికి కూడా కాలం ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఏకంగా నోటి దాకా వచ్చిన ఆహారం చేజారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఒక డేగ ఎంతో వేగంగా దూసుకు వచ్చింది. ఏకంగా పిల్లి రూపంలో తనకు ఆహారం దొరికింది అని సంబరపడిపోయింది. ఇక పిల్లిని ఎత్తుకెళ్లాలని వచ్చిన డేగకు చివరికి ఊహించని రీతిలో ట్విస్ట్ ఎదురయింది.

 పిల్లిని ఆహారంగా మార్చుకోవాలని వచ్చిన డేగకు చివరికి నిరాశతో వెను తిరగాల్సి వచ్చింది. నగరంలోకి వచ్చిన ఒక డేక ఆహారం కోసం తిరుగుతూ ఒక గోడ పై వాలుతుంది. అయితే అక్కడ చుట్టూ ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూస్తుంది. ఇంతలో ఇక దూరంగా ఒక పిల్లి కనిపిస్తుంది. దీంతో ఇక సంబరపడిపోయిన డేగ వేగంగా అక్కడికి దూసుకు వచ్చి పిల్లిని కాళ్లతో పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడికి వచ్చినాక కూడా అర్థం కాదు.. ఆ పిల్లి ఉంది బయట కాదు కారు అద్దం లోపల అని. అయినప్పటికీ దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. చివరికి కుదరకపోవడంతో నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: