వైరల్:న్యూ ఇయర్ వేడుకల పైన రెండు రాష్ట్రాలలో ఆంక్షలు..!!

Divya
న్యూ ఇయర్ రాబోతోంది అంటే చాలు మందు బాబులకు పెద్ద పండుగే.. ప్రతిసారి కూడా పలు రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు పలు రకాల నిబంధనలు పెడుతూ ఉంటారు.. ఈసారి కూడా తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు ఉండబోతున్నాయంటూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా యూత్ ఊరికే ఉంటారా సెలబ్రేషన్స్ అంటు నాన హంగామా సృష్టిస్తూ ఉంటారు.. అనేక గొడవలకు పోతూ ఉంటారు. అంతే కాకుండా సాధారణ రోజుల్లోనే చాలామంది మద్యం తాగి వాహనాలను నడుపుతున్న సందర్భాలు మనం ఎన్నో చూశాం..వీటిని కంట్రోల్ చేయటానికి పోలీసులు అలా తాగినడపద్దండి అంటు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూశాం.


అందుకని ఈసారి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చాలా కఠినంగా నిర్వహిస్తూ.. దొరికిన వారిపై పలు కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు.. అయితే.. డిసెంబర్ 31 రోజున విచ్చలవిడిగా తాగి అర్ధరాత్రులు  ఎవరైనా వాహనాలు నడిపి రచ్చ రచ్చ చేస్తే మాత్రం చాలా  కఠిన నిబంధనలే అమలు చేయబోతున్నారు. అందుకోసమే డిసెంబర్ 31న డ్రంకన్ డ్రైవ్ చేసి బైకులు నడిపితే వారి సంగతులు అంతే..ఒకవేళ మద్యం చేసి బైక్ కార్ నడుపుతు  తనిఖీల్లో పట్టుబడితే ఆ వ్యక్తులకు రూ.15వేల వరకు జరిమానాతో పాటు 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు హైదరబాద్ పోలీసులు సైతం ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా నూతన వేడుకల పైన పోలీసులు పలు రకాల ఆంక్షలు విధించారు.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30,144 సెక్షన్ ప్రతి ఒక్కరికి అమలులో ఉందని.. ఎక్కడ కూడా 5 మందికి మించి గుంపులుగా ఉండకూడదని ఫ్లై ఓవర్ల పైన వాహనాలు నిలపకూడదని హోటల్స్ యాజమాన్యాలు పోలీసులు అనుమతి తీసుకోవాలని లిక్కర్ సర్వే చేస్తే ఎక్సేంజ్ శాఖ అనుమతి ఇవ్వదు అంటూ కూడా తెలియజేశారు.. ఒకవేళ అందులో పట్టుబడితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: