కారును ఢీ కొట్టిన విమానం.. వీడియో వైరల్?
ఇక్కడ ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని మెక్ కిన్నెలో వెలుగులోకి వచ్చింది. విచిత్రమైన రీతిలో ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా విమానం రన్ వే పై ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ ఇక్కడ విమానం మాత్రం రన్ వే మీద నుంచి ఏకంగా రోడ్డుమీదికి దూసుకు పోయింది. అంతేకాదు ఈ విమానం ఒక కారును ఢీ కొట్టింది. మధ్యాహ్నం సమయంలో ఏదో ఒక సింగిల్ ఇంజన్ విమానం రన్ వే పై నుంచి టేక్ ఆఫ్ అయింది. అయితే దానిని పైలెట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం రన్ వే చివరి వరకు వచ్చిన ఆగలేదు. దీంతో బుల్లి విమానం ఏర్పోర్ట్ కు కొంచెం దాటుకొని ఈస్ట్ బౌండ్ వర్జినియా పార్క్ వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడంతో ఇక ఆ రోడ్డుని దాదాపు ఒక రోజు పాటు అధికారులు మూసి వేశారు అని చెప్పాలి.