సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ప్రేమికులు వీడియోలు కూడా ఒక్కోసారి వైరల్ అవుతూ ఉంటాయి. వారు ఒకరికొకరు రహస్యంగా కలుసుకున్న కథలను చాలాసార్లు విని ఉంటారు. ఇంకా ఇది చాలా సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా, నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి.ఇక తాజాగా రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఇప్పుడు వీరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె దగ్గరకి చేరుకున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అతడిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి కూలర్లో దాక్కున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఎప్పటిదో తెలియరాలేదు.ఇంకా అంతేకాకుండా రాజస్థాన్‌లోని ఏ నగరానికి చెందినది అనేది కూడా సమాచారం లేదు. ప్రేమికుడు రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లగా ఆమె కుటుంబసభ్యులు దొరికిచ్చుకున్నట్లు చెబుతున్నారు.
నిజానికి దొంగ వచ్చాడని కుటుంబ సభ్యులు భావించారు. ఆ తర్వాత ఇంట్లో అతన్ని వెతకడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వీధిలో కుక్కలు మొరగడం ప్రారంభించాయి, దాని కారణంగా అందరూ వెంటనే నిద్ర నుంచి మేల్కొన్నారు.ఆ తరువాత వెతకగా.. ఆమె ఏదో దాస్తోందని వారు అనుమానించారు. ఆ కూలర్ లోపల ఆమె ఉందని అనుమానించారు. చూడగానే అందులో దాక్కుని కూర్చున్న ఆమె ప్రేమికుడు కనిపించాడు.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో అతను ఆమె ప్రియుడని తెలుస్తోంది. @gharkekalesh అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ వీడియో షేర్ చేయబడింది. దీనిపై నెటిజన్స్ ఫన్నీగా చాలా కామెంట్లు చేస్తున్నారు. అమ్మడి టెక్నిక్ భలేగా ఉందని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరేమో కూలర్లు కేవలం చల్లదనానికే కాదు ఇలా తల దాచుకోవడానికి కూడా భలేగా పని వస్తున్నాయి అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తుంది.