ఈ తాత కసి చూసి కుర్రాళ్లే షాక్.. లుంగీ కట్టుకొని?
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం.. పదరా సోదరా..
అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది..
ఏంటి బాసు అసలు మ్యాటర్ చెప్పడం మానేసి.. ఇలా మోటివేషనల్ సాంగ్స్ పాడుతున్నావ్ అంటారా... నేను పాడటం కాదు బాసు ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే ఆటోమేటిక్గా మీ నోటి నుంచి కూడా ఇలాంటి పాటలే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో అంతలా అందరికీ కనెక్ట్ అయిపోతూ ఉంది.
పలానా వయసులో.. పలానా పనులు చేయాలి. వయసు మీద పడిన తర్వాత కొన్ని పనులకు దూరంగా ఉండాలి అని ఎంతో మంది జనాలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే.. చేయాలనే సంకల్పం ఉండాలే కానీ వయసుతో సంబంధం ఏముంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. వైరల్ గా మారిపోయిన వీడియోలో ఒక వృద్ధుడు కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో చెమటలు చిందిస్తున్నాడు. చెమటలు చిందిస్తున్నాడు అంటే ఏదో పొలంలో పనిచేస్తున్నాడు అనుకునేరు. ఏకంగా జిమ్ లో వర్కౌంట్లో చేస్తున్నాడు.
అది కూడా ఆషామాషీగా కాదండోయ్.. ఒక పెద్ద బాడీబిల్డర్ ఎలా అయితే కఠినమైన వర్కౌట్లు చేస్తాడో.. ఇక్కడ ఒక వృద్ధుడు కూడా అదే రీతిలో వర్కౌట్లు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. 85ఏళ్ళ వృద్ధుడు.. లుంగీ ధరించి జిమ్ లో కష్టపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు వర్కౌట్లు చేస్తున్న స్టైల్ అతని లుక్ చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. కుర్రాళ్లే ఇలాంటి వర్కౌంట్లు చేయడానికి భయపడిపోతూ ఉంటే 85 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. తాతగారు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే.. ఆ వయసులో కుమ్మేసి ఉంటారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.